అంతరిక్షంలోనూ హాయిగా బతికేస్తా...

ఎనిమిది కాళ్లతో.. విచిత్రమైన మూతితో.. కాస్త భయంకరంగా..ఓ రకంగా చెప్పాలంటే గ్రహాంతరవాసిలా కనిపిస్తున్న నేను నిజానికి మీ భూగ్రహ వాసినే! కానీ అంతరిక్షంలోనూ బతకగలను. ఈ విషయాన్ని మీ శాస్త్రవేత్తలు 2007లో తేల్చారు. చదువుతుంటే..భలే ఆసక్తిగా ఉంది కదా! మరి నా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఉందా? అవన్నీ చెప్పడానికే  ఇలా వచ్చా.

Published : 02 May 2020 00:39 IST

నేనెవరో తెలుసా!

ఎనిమిది కాళ్లతో.. విచిత్రమైన మూతితో.. కాస్త భయంకరంగా..ఓ రకంగా చెప్పాలంటే గ్రహాంతరవాసిలా కనిపిస్తున్న నేను నిజానికి మీ భూగ్రహ వాసినే! కానీ అంతరిక్షంలోనూ బతకగలను. ఈ విషయాన్ని మీ శాస్త్రవేత్తలు
2007లో తేల్చారు. చదువుతుంటే..భలే ఆసక్తిగా ఉంది కదా! మరి నా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఉందా? అవన్నీ చెప్పడానికే  ఇలా వచ్చా.

పేరు: టార్డిగ్రేడ్‌
ముద్దుపేర్లు: నీటి ఎలుగు, స్లో వాకర్‌
రకాలు: మాలో 1,300 రకాల జీవులున్నాయి
ప్రత్యేకత: భూమిమీద, అంతరిక్షంలో, చంద్రుడి మీద, హిమాలయాల వంటి ఎత్తైన పర్వతాలు, ధృవాలు, లోతైన సముద్రాల్లో, రేడియేషన్‌ ఉన్న ప్రాంతాలు.. ఇలా ఎంతటి విపత్కర పరిస్థితుల్లో అయినా హాయిగా బతికేస్తా. తీవ్ర డీ హైడ్రేషన్‌ను సైతం తట్టుకుంటా. ఎంతలా అంటే.. శరీరంలో పూర్తిగా 99శాతం నీటిని కోల్పోయినా జీవించే ఉంటా.
పరిమాణం: నేను సూక్ష్మజీవిని. కేవలం 0.5 మి.మీ ఉంటానంతే. నన్ను చూడాలంటే సూక్ష్మదర్శిని(మైక్రోస్కోప్‌) కావాల్సిందే! మరో విచిత్రం ఏంటంటే నాకు విచిత్రంగా కీటకాల్లా నాలుగు జతల కాళ్లుంటాయి!
జీవితకాలం: మూడు నుంచి నాలుగు నెలల పాటు జీవిస్తాను. మాలో కొన్ని రకాలు రెండేళ్ల వరకూ జీవిస్తాయి.
ఆహారం: మొక్కల కణాలు, నాచును ఆహారంగా తీసుకుంటా. మాలో ఆడ, మగ రెండు జీవులూ ఉంటాయి. మేం గుడ్లు పెడతాం. వాటి నుంచి పిల్లలు వస్తాయి. నేను ఈ భూమి మీద ఎక్కడైనా బతకగలను. ఎక్కువగా నీటి కుంటల్లో ఉంటా. నేను చాలా చిన్నగా ఉంటా కదా.. మీకు కనిపించనంతే!
హాని చేయను: నేను సూక్ష్మజీవిని అయినప్పటికీ వైరస్‌, కొన్ని రకాల బ్యాక్టీరియాల్లా మీకు హాని చేయను. నేను రేడియేషన్‌ను తట్టుకున్నప్పటికీ మీ రోగనిరోధక శక్తిని (ఇమ్యూనిటీ పవర్‌) ఎదిరించి బతకలేను. పైగా నేను వైరస్‌, బ్యాక్టీరియాల్లా మీ శరీరంలోకి వెళ్లాక నా సంతతిని పెంచుకోను. కాబట్టి నా వల్ల మీకు అంత ప్రమాదమేమీ లేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని