అరచేతిలో అద్భుతం!

నాణేన్ని గాల్లోకి ఎగరేస్తే బొమ్మ కానీ బొరుసు కానీ పడుతుంది. ఈ రెండూ కాకుండా మధ్యలో నిలుచుంటే భలే ఉంటుంది కదూ! ఒక్క నాణెం అలా ఉంటేనే ఆశ్చర్యపోతాం.. మరి ఒకదానిపై మరోటి అలా మూడు నాణేలు ఉంటే.. పే..ద్ద వింతే కదూ! కానీ ఓ చిన్న చిట్కాతో మీరూ అలా చేసేయొచ్ఛు అదే మ్యాజిక్‌ అంటే..! ఎలా చేయడమో మీరూ తెలుసుకుంటారా మరి!

Updated : 30 Aug 2020 01:42 IST

అబ్రకదబ్ర హాంఫట్‌

నాణేన్ని గాల్లోకి ఎగరేస్తే బొమ్మ కానీ బొరుసు కానీ పడుతుంది. ఈ రెండూ కాకుండా మధ్యలో నిలుచుంటే భలే ఉంటుంది కదూ! ఒక్క నాణెం అలా ఉంటేనే ఆశ్చర్యపోతాం.. మరి ఒకదానిపై మరోటి అలా మూడు నాణేలు ఉంటే.. పే..ద్ద వింతే కదూ! కానీ ఓ చిన్న చిట్కాతో మీరూ అలా చేసేయొచ్ఛు అదే మ్యాజిక్‌ అంటే..! ఎలా చేయడమో మీరూ తెలుసుకుంటారా మరి!

ముందుగా మూడు నాణేలు తీసుకోండి. అరచేతిలో ఒకదాన్ని ముందు నిలబెట్టండి. తర్వాత దాని మీద మరోటి.. మళ్లీ దీని మీద ఇంకోటి.. ఇలా ఒకదానిపై ఒకటి మొత్తం మూడు నాణేలు నిల్చోబెట్టేయండి.

చిట్కా ఏంటంటే..

ప్ఛ్‌.! ఎంత ప్రయత్నించినా.. రావడం లేదు కదూ..! ముందే చెప్పాగా ఓ చిట్కా ఉంది అని.. అదేంటో ఇప్పుడు చెప్పనా..! చెబుతున్నా.. చెప్పేస్తున్నా...! ఏం లేదు చాలా తేలిక. చిన్న అయస్కాంతాలు ఉంటే చాలు!

ఇలా చేయాలి!

ముందు ఒక నాణెం తీసుకుని దాని వెనక ఎవరికీ కనిపించకుండా చిన్న అయస్కాంతాలు ఓ రెండు, మూడు అతికించాలి. అయస్కాంతం సాయంతో నాణెం అరచేతిలో చాలా తేలిగ్గా నిల్చుంటుంది. ఇప్పుడు దీని పైన నెమ్మదిగా మరో నాణేన్ని పెట్టండి. తర్వాత మరింత జాగ్రత్తగా మరో నాణేన్ని ఉంచండి. ఒకదానిపై మరోటి ఇలా మొత్తం మూడు నిల్చుంటాయి. అయస్కాంత శక్తి మొదటి నాణెం నుంచి రెండో దానికి.. రెండో దాని నుంచి మూడో దానికి ప్రయాణించి అవి అతుక్కునేలా చేస్తుంది.

జాగ్రత్త సుమా!

ఈ మ్యాజిక్‌ చేసే ముందు కాస్త ప్రాక్టీస్‌ చేయడం మరిచి పోవద్ధు మన ముందున్న వాళ్లకు ఏమాత్రం అనుమానం రాకుండా చేయాలి. వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు మరీ దగ్గరగా రాకుండా చూసుకోవాలి. అయస్కాంతానికి అతుక్కునే గుణం ఉన్న కాయిన్స్‌తోనే మ్యాజిక్‌ చేయాలి. వీలైతే మీరూ అమ్మానాన్న సాయంతో ప్రయత్నించి ఈ మ్యాజిక్‌ నేర్చేసుకోండి.. సరేనా!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని