చిట్టి చీమల గృహప్రవేశం

‘విశ్రాంతి తీసుకోవడానికి సరైన ఇల్లు లేదు. వాన తగ్గగానే చక్కని ఇంటిని నిర్మించుకోవాలని’ చిట్టి చీమలన్నీ తీర్మానించుకున్నాయి. మర్నాడు సాయంత్రానికి అందమైన పుట్టను నిర్మించి ఘనంగా గృహప్రవేశం చేశాయి. మరుసటి రోజు చీమలు యథాప్రకారం ఆహారం కోసం బయటకు వెళ్లాయి.

Published : 16 Oct 2020 02:19 IST

‘విశ్రాంతి తీసుకోవడానికి సరైన ఇల్లు లేదు. వాన తగ్గగానే చక్కని ఇంటిని నిర్మించుకోవాలని’ చిట్టి చీమలన్నీ తీర్మానించుకున్నాయి. మర్నాడు సాయంత్రానికి అందమైన పుట్టను నిర్మించి ఘనంగా గృహప్రవేశం చేశాయి. మరుసటి రోజు చీమలు యథాప్రకారం ఆహారం కోసం బయటకు వెళ్లాయి.
సాయంత్రం వచ్చిన చీమలు పుట్టలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా బుస్‌మని శబ్దం వినపడింది. ఒక సర్పం బయటకు వచ్చి ఈ కొత్త ఇల్లు నాకు నచ్చింది. మీరు ఇందులోకి వస్తే మీ అంతుచూస్తా అని హెచ్చరించింది.
ఇదంతా దూరం నుంచి ఓ కుందేలు చూసి చీమలను దగ్గరకు పిలిచింది. ‘మీరు కంటికే సరిగా కనబడరు. ఇక బలవంతమైన సర్పాన్ని ఎలా ఎదుర్కొంటారు?’ అంది. ‘నువ్వే ఏదోవిధంగా ఆ పాము బయటకు పోయేలా చూడాలి’ అని చీమలు ప్రాధేయపడ్డాయి.
కాసేపు ఆలోచించిన తర్వాత కుందేలు బుర్రలో ఒక ఉపాయం తట్టింది. తాను ఆహారంగా తీసుకునే దుంపలను నేలలోంచి సేకరించి పుట్ట చుట్టుపక్కల పడవేసింది. చీమలతోపాటు తానూ దూరంగా వెళ్లింది. ఇంతలో అక్కడికి ఓ ఎలుగుబంటి వచ్చింది. దానికి పుట్ట దగ్గర దుంపలు కనబడ్డాయి. ఆనందంతో అరుస్తూ తినసాగింది.
ఆ అరుపులకు చిరాకు పుట్టి పాము బయటకు వచ్చి బుసలు కొట్టింది. అసలే మంచి ఆకలి మీద ఉన్న ఎలుగుబంటి కోపంతో దాన్ని నేలకేసి కొట్టింది. దెబ్బకు సర్పం అక్కడి నుంచి జారుకుంది. దుంపలన్నీ తిన్న తర్వాత ఎలుగుబంటి దూరంగా వెళ్లిపోయింది. చీమలు కుందేలుకు కృతజ్ఞతలు చెప్పి మరోసారి తమ గృహప్రవేశం ఘనంగా చేసుకున్నాయి.

- తమ్మవరపు వెంకటసాయి సుచిత్ర, ఖమ్మం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని