ఈ నగరానికి దారేది ?

పెరూ దేశంలోని ఇక్విటుస్‌ సిటీలో ఇంచుమించు ఐదు లక్షల మంది జనాలు నివసిస్తుంటారు. మన దగ్గర ఉన్నట్లే స్కూళ్లు, ఆసుపత్రులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు ఇలా బోలెడన్ని సౌకర్యాలూ ఉంటాయి. ఏ నగరమైనా ఇలాగే ఉంటుంది. అందులో ఏముంది ప్రత్యేకత అంటారా? ఆ.... అక్కడే ఉంది అసలు సంగతి. ఈ నగరంలోకి ఎవరైనా వెళ్లాలన్నా... అక్కడి ప్రజలు వేరే ప్రాంతాలకు ప్రయాణించాలన్నా... అయితే పడవల్లో వెళ్లాలి. లేదంటే హెలీకాఫ్టర్‌ లాంటి వాటిల్లో గగన విహారం చేయాలి. కారణం ఈ నగరానికి వేరే ఏ ప్రాంతాన్నీ కలుపుతూ రోడ్లు ఉండవు....

Published : 28 Dec 2018 00:19 IST

దీవిలో ఉన్న ఊరిలోకి బస్సులు, జీపులు, కార్లు వేసుకుని వెళ్లలేం... ఎందుకంటే వాటికి రహదారి మార్గమే ఉండదు... కానీ ఓ నగరం దీవిలో లేకపోయినా రోడ్లు ఉండవు... ఎందుకో ఏమిటో ? ఇంతకీ ఏమా నగరం? ఎక్కడుంది?

ఈ నగరానికి దారేది ?

పెరూ దేశంలోని ఇక్విటుస్‌ సిటీలో ఇంచుమించు ఐదు లక్షల మంది జనాలు నివసిస్తుంటారు. మన దగ్గర ఉన్నట్లే స్కూళ్లు, ఆసుపత్రులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు ఇలా బోలెడన్ని సౌకర్యాలూ ఉంటాయి. ఏ నగరమైనా ఇలాగే ఉంటుంది. అందులో ఏముంది ప్రత్యేకత అంటారా? ఆ.... అక్కడే ఉంది అసలు సంగతి. ఈ నగరంలోకి ఎవరైనా వెళ్లాలన్నా... అక్కడి ప్రజలు వేరే ప్రాంతాలకు ప్రయాణించాలన్నా... అయితే పడవల్లో వెళ్లాలి. లేదంటే హెలీకాఫ్టర్‌ లాంటి వాటిల్లో గగన విహారం చేయాలి. కారణం ఈ నగరానికి వేరే ఏ ప్రాంతాన్నీ కలుపుతూ రోడ్లు ఉండవు.

ఈ నగరానికి దారేది ?

* ఎందుకబ్బా? చుట్టూ నీళ్లతో ఉండే దీవిలో ఉందా ఏంటీ ఈ నగరం? అనే సందేహం వచ్చింది కదూ. కానీ కాదు. ఇదో అడవి పట్టణం. అమెజాన్‌ నది గురించి వినే ఉంటారుగా. ఆ నది పరివాహక ప్రాంతంలోనే ఈ నగరం ఉంటుంది. పైగా ననయ్‌, ఇటాయా అనే రెండు నదులూ ఈ సిటీ దగ్గరే కలుస్తాయి. అందుకే ఈ సిటీకి ఒకవైపు మొత్తం నీళ్లుంటాయి. మిగతా వైపులా దట్టమైన అమెజాన్‌ అడవి ఉంటుంది.

ఈ నగరానికి దారేది ?

* ప్రపంచంలోనే రహదారులు లేని పెద్ద నగరం ఇది. కానీ ఈ ఊళ్లో మాత్రం మామూలుగా మన దగ్గర ఉన్నట్టే ఉంటాయి రోడ్లన్నీ. కార్లు, రిక్షాలు, ఆటోలు అన్నీ తిరిగేస్తాయి.
* ఒకప్పుడు ఇక్కడ స్థానిక తెగల ప్రజలుండేవారు. ఆ తర్వాత ఇతర ప్రాంతాల నుంచీ వచ్చిస్థిరపడ్డారు. రబ్బరు, కలప పరిశ్రమలు, పర్యటకం వల్ల ఇది ధనిక పట్టణమయ్యింది.
* ఇక్కడికి దేశదేశాల నుంచి పర్యటకులు వస్తుంటారు. ప్రత్యేక ఆకర్షణ అమెజాన్‌ నది,అడవి. ఫ్లోటింగ్‌ హోటల్‌, బటర్‌ఫ్లై జూ వంటివీ సందర్శకుల్ని ఆకట్టుకుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని