నవ్వుల్‌.. నవ్వుల్‌..

తాత: చింటూ.. మీ టీచర్‌ వస్తున్నారు. వెళ్లి దాక్కో పో!చింటు: మీరే వెళ్లి దాక్కోండి తాతా!

Updated : 14 Mar 2022 05:00 IST

తాతా.. నువ్వే దాక్కోవాలి!

తాత: చింటూ.. మీ టీచర్‌ వస్తున్నారు. వెళ్లి దాక్కో పో!

చింటు: మీరే వెళ్లి దాక్కోండి తాతా!

తాత: నేనా.. ఎందుకు?

చింటు: నువ్వు చనిపోయావని చెప్పి వారం నుంచి నేను స్కూలుకు వెళ్లడం లేదు మరి.

తాత: ఆఁ!!


ఇదేం న్యాయం!

టీ©చర్‌: ఏంటి బంటీ... ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నావ్‌?

బంటి: ఏం లేదు టీచర్‌.. బాల్యవివాహాలు నేరం కదా!

టీ©చర్‌: అవును బంటీ.. బాల్యవివాహాలు చట్టరీత్యానేరం. అయినా ఇప్పుడెందుకు ఆ ప్రస్తావన.

బంటి: బాల్య వివాహాలు నేరం అయినప్పుడు.. బాల్య చదువులు కూడా నేరం కావాలిగా!

టీ©చర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని