నవ్వుల్‌.. నవ్వుల్‌...!

పరీక్షలు సరిగా రాయకపోతే ఫెయిలవుతారు జాగ్రత్త. అందుకే చక్కగా చదవండి.

Published : 17 Apr 2022 01:31 IST

చిక్కు ప్రశ్నే!

టీచర్‌: పరీక్షలు సరిగా రాయకపోతే ఫెయిలవుతారు జాగ్రత్త. అందుకే చక్కగా చదవండి.
టింకు: టీచర్‌ నాకో అనుమానం.
టీచర్‌: గుడ్‌.. ఏమైనా అనుమానాలుంటే.. ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోవాలి. ఇంతకీ నీకొచ్చిన డౌట్‌ ఏంటి టింకూ...!
టింకు: ఏం లేదు టీచర్‌. పరీక్షల్లో ఫెయిల్‌ అయితే.. మేం ఇంతవరకు కట్టిన ఫీజులు మావి మాకు తిరిగి ఇచ్చేస్తారా?
టీచర్‌: ఆఁ!!


నిజమే మరి!

టీచర్‌: సెలవుల్లో మీరంతా ఏం చేస్తారు పిల్లలూ!
పింకి: బడికి మాత్రం రాము టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


ఇదీ నిజమే!

టీచర్‌: మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది?
చింకు: స్విగ్వీ, జొమాటో నుంచి వస్తుంది టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని