నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నాన్న: చింటూ.. నీకు లెక్కల్లో సున్నా మార్కులు వచ్చాయేంటి?

Published : 29 Jul 2022 00:26 IST

అదన్నమాట కారణం

నాన్న: చింటూ.. నీకు లెక్కల్లో సున్నా మార్కులు వచ్చాయేంటి?
చింటు: హాజరవ్వలేదునాన్నా.

నాన్న: ఆ రోజు నువ్వు స్కూలుకు వెళ్లావు కదరా?
చింటు: హాజరు కానిది నేను కాదు నాన్నా... నా ముందు కూర్చునే బిట్టూ..

నాన్న: ఆఁ!!

రెట్టింపు లెక్కింపు!

టీచర్‌: రెండు రెళ్లు ఎంత?
పవన్‌: ఎనిమిది టీచర్‌..

టీచర్‌: తప్పు చెబుతున్నావేంటి పవన్‌?
పవన్‌: అన్ని ధరలూ రెట్టింపు అయ్యాయి కదా టీచర్‌..

కరక్టే కదా సార్‌!

టీచర్‌: గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటి?
వరుణ్‌: గురువును ఆకర్షించే శక్తినే గురుత్వాకర్షణ శక్తి అంటారు టీచర్‌.
టీచర్‌: ఆఁ!!

జస్ట్‌ మిస్‌!

చంటి: నిన్న వరంగల్‌లో జరిగిన బస్సు ప్రమాదం నుంచి నేను త్రుటిలో తప్పించుకున్నాను.
బంటి: అవునా.. ఎలా?

చంటి: నేను ఆ టైంలో కరీంనగర్‌లో మా నాన్నతోపాటు కారులో ఉన్నా.
బంటి: ఊఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని