నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నాన్న: ఒరేయ్‌! బంటీ ఈ సారి క్లాస్‌లో లాస్ట్‌ ర్యాంక్‌ వచ్చిందేంట్రా?

Published : 01 Aug 2022 00:18 IST

నాదేం తప్పులేదు!

నాన్న: ఒరేయ్‌! బంటీ ఈ సారి క్లాస్‌లో లాస్ట్‌ ర్యాంక్‌ వచ్చిందేంట్రా?
బంటి: ఎప్పుడూ లాస్ట్‌ వచ్చే చింటూ స్కూలు మారాడు నాన్నా. అందుకే ఈ సారి నేను లాస్ట్‌ వచ్చా.
నాన్న: ఆఁ!!

నేనే ఫస్ట్‌ టీచర్‌!

టీచర్‌: ఈ సారి బిట్టూ... మన క్లాస్‌ ఫస్ట్‌.
కిట్టు: ఇది అన్యాయం టీచర్‌.

టీచర్‌:  ఏ.. ఎందుకు?
కిట్టు:  ప్రతిరోజూ క్లాస్‌కు నేనే అందరికన్నా ముందు వస్తున్నా టీచర్‌. అంటే నేనే క్లాస్‌ ఫస్ట్‌ కదా టీచర్‌.

టీచర్‌: ఆఁ!!

చాలా బాగుంది!

యోగా గురువు: చంటీ. అరగంట ధ్యానంలో ఉన్నావు కదా.. ఏమనిపిస్తోంది.
చంటి: రోజూ ఇలాగే హాయిగా నిద్రపోవాలనిపిస్తోంది.
యోగా గురువు: ఆఁ!!

క్లారిటీ ఉండాలిగా!

టీచర్‌: టింకూ.. నీకు ఎన్నేళ్లు?
టింకు: కుడి చేతికా.. లేక ఎడమ చేతికా.. కుడి కాలికా.. లేక ఎడమ కాలికా.. టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని