నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: చింటూ.. నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలి అనుకుంటున్నావు?

Published : 08 Aug 2022 00:19 IST

అనుకుంటున్నా!

టీచర్‌: చింటూ.. నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలి అనుకుంటున్నావు?
చింటు: మా నాన్నగారిలా సైంటిస్టు అవ్వాలనుకుంటున్నా.

టీచర్‌: మీ నాన్నగారు సైంటిస్టా?
చింటు: కాదు టీచర్‌. అవ్వాలనుకున్నారు.

టీచర్‌: ఆఁ!!

అంతేగా... అంతేగా...!

టీచర్‌: చంటీ! 15వ శతాబ్దంలో ప్రజల జీవనం గురించి చెప్పు?
చంటి: ఇంకెక్కడి 15వ శతాబ్దం, ఇంకెక్కడి ప్రజలు... ఎప్పుడో చచ్చిపోయారు.
టీచర్‌: ఆఁ!!

దటీజ్‌ కిట్టూ!

టీచర్‌: కిట్టూ.. 6x4 ఎంతో చెప్పు?
కిట్టు: 24 టీచర్‌.

టీచర్‌: గుడ్‌.. మరి 4x6 ఎంత?
కిట్టు: 42.. మీరు తిరగేసి అడిగితే చెప్పలేను అనుకున్నారా టీచర్‌.

టీచర్‌: ఆఁ!!

మాస్టారు చెప్పారు మరి!

నాన్న: నా ఫొటోకి దండేశావేంట్రా బిట్టూ!
బిట్టు: తండ్రి దైవంతో సమానమని మా మాస్టారు చెప్పారు నాన్నా!
నాన్న: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని