నవ్వుల్‌.. నవ్వుల్‌.!

కిట్టూ.. నిన్న తరగతి గదిలో సూక్తులన్నింటినీ నువ్వే బాగా చెప్పావట కదా?

Published : 28 Jun 2023 00:09 IST

ఎంత కష్టమో..

నాన్న : కిట్టూ.. నిన్న తరగతి గదిలో సూక్తులన్నింటినీ నువ్వే బాగా చెప్పావట కదా?
కిట్టు : అవును నాన్నా..
నాన్న : వెరీగుడ్‌.. అలాగే అవన్నీ పాటించాలి కూడా..
కిట్టు : అది మాత్రం కుదరదు నాన్నా.. సూక్తులు చెప్పడం సులభం కానీ, పాటించడం చాలా కష్టం..
నాన్న : ఆ..!!

వెరీ సింపుల్‌..

వ్యాయామ ఉపాధ్యాయుడు: పిల్లలూ.. పరుగు పందెంలో గెలవాలంటే ఏం చేయాలో తెలుసా?
లహరి : తెలుసు సార్‌..
వ్యా.ఉ : శెభాష్‌.. ఏంటో చెప్పు?
లహరి : పోటీలో పాల్గొనే వారి వెనకాల కుక్కలను వదిలితే సరి..
వ్యా.ఉ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని