నవ్వుల్‌.. నవ్వుల్‌.!

Published : 24 Aug 2023 00:02 IST

భలే.. భలే..

టీచర్‌ : పావనీ.. వడదెబ్బ తగిలితే ఏం చేయాలో తెలుసా?
పావని : తెలుసు టీచర్‌..
టీచర్‌ : ఏంటో చెప్పు..
పావని : స్పృహ తప్పి కిందపడిపోవాలి టీచర్‌..


అంతే మరి..

అంకుల్‌ : అదేంటి రామూ.. అర్జంటు పని ఉందని వెళ్లిన మీ మావయ్య వెంటనే తిరిగొచ్చేశాడు?
రాము : తను బయటకు వెళ్తున్నప్పుడు ‘ఎక్కడికి?’ అని అడిగితే మా మావయ్యకు నచ్చదురా..
అంకుల్‌ : ఇప్పుడెవరూ అడగలేదు కదా?
రాము : బయట బస్‌ కోసం ఎదురుచూస్తుంటే.. ఆటో అతను ‘ఎక్కడికి సార్‌..?’ అని అడిగాడట..
అంకుల్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు