నవ్వుల్‌.. నవ్వుల్‌..!

బంటి: ఏంటి చింటూ.. సడెన్‌గా గుండు చేయించుకున్నావు?

Published : 10 Oct 2023 01:06 IST

అందుకే గుండు చేయించా..!

బంటి: ఏంటి చింటూ.. సడెన్‌గా గుండు చేయించుకున్నావు?
చింటు: నేను హోంవర్క్‌ చేయలేదు బంటీ..
బంటి: అయితే..?
చింటు: హోంవర్క్‌ చేయకపోతే టీచర్‌ జుట్టుపట్టుకొని కొడతానన్నారు బంటీ అందుకే..

బంటి: ఆఁ..!


అదే వేరైపోతుంది..!

కిట్టు: నాకో సందేహం బిట్టూ.. సమాధానం చెబుతావా?
బిట్టు: నువ్వు అడుగు కిట్టూ.. కచ్చితంగా చెబుతాను..
కిట్టు: మరేం లేదు.. కలిసిపోయిన ఇసుక, చక్కెరను ఎలా వేరుచేయాలి?
బిట్టు: అంతేనా.. కాసేపు ఆగితే అదే వేరైపోతుందిలే..
కిట్టు: అదెలా?
బిట్టు: చీమలొచ్చి చక్కెర తినేస్తాయి.. అప్పుడు ఇసుకేగా మిగిలేది..!
కిట్టు: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని