సాధనతో సాధించారు!
హాయ్ ఫ్రెండ్స్.. కొన్ని ప్రాంతాల్లో బడి మానేసేవారి సంఖ్య ఏటా పెరుగుతూ ఉంటుంది. ఆ సమస్యకు పరిష్కారంగా ఒక్కో చోట ఒక్కో విధానం పాటిస్తుంటారు. అలాగే, తమిళనాడులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టిన విధానం.. ఇప్పుడా బడిలో చదివే విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చింది. ఇంతకీ ఆ విశేషాలేంటో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి మరి..
తమిళనాడు రాష్ట్రంలోని మాధవరం ప్రభుత్వ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు నిభా కుమారి, రేవతి, తమిళ్.. మార్షల్ ఆర్ట్స్‌లో సత్తా చాటుతున్నారు. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన ఛాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతకాలు సాధించి.. అందరితో శెభాష్ అనిపించుకుంటున్నారు.
తరగతులు ముగిసిన తర్వాత..
మాధవరంలో ఏటా బడికి వచ్చేవారి సంఖ్య తగ్గిపోతుండటంతో గ్రామ పెద్దలతోపాటు ఉపాధ్యాయులూ ఆందోళనకు గురయ్యారు. అప్పుడు వారంతా సమావేశమై.. ఎలాగైనా విద్యార్థుల సంఖ్యను పెంచాలనుకున్నారు. తరగతులు ముగిసిన తర్వాత.. పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలనే ఆలోచనకు వచ్చారు. ఆ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చాక.. విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. అలా శిక్షణ పొందిన వారిలో ముగ్గురు ఇటీవల అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటారు.
రకరకాల నేపథ్యం..
ఆ ముగ్గురు విద్యార్థులు కొన్నేళ్ల క్రితమే మార్షల్ ఆర్ట్స్ సాధన చేయడం ప్రారంభించారు. ఇప్పటికే స్థానికంగా అనేక పోటీల్లో తలపడి బహుమతులూ గెలుచుకున్నారు. ఇండోనేషియా, నేపాల్‌కు చెందిన ప్రత్యర్థులనూ ఓడించి.. ఔరా అనిపించారు. శిక్షకులు నవీన్, లోకేశ్.. ప్రతి రోజూ 20 మంది విద్యార్థులకు ఉచితంగానే మెలకువలు నేర్పిస్తున్నారు. ఇండోనేషియాలో జరిగిన పోటీల్లో భారత్ నుంచి మొత్తం 34 మంది తలపడగా.. వారిలో ఈ ముగ్గురే అద్భుత ప్రతిభ చూపారట. ఈ బడిలో సాయంత్రం వేళల్లో మార్షల్ ఆర్ట్స్‌తోపాటు డ్యాన్స్, సింగింగ్ కూడా నేర్పుతున్నామని ప్రధానోపాధ్యాయురాలు సెల్వ కుమారి చెబుతున్నారు.
‘సోషల్ మీడియాలో చూసి..’
నా పేరు తమిళ్. ఎనిమిదో తరగతి చదువుతున్నా. సోషల్ మీడియాలో చూసి మార్షల్ ఆర్ట్స్‌పైన ఆసక్తి పెంచుకున్నాను. మా స్కూల్‌లో శిక్షణ ప్రారంభించినప్పుడు నేను ఆరో తరగతిలో ఉన్నాను. మొదటిసారి పోటీల్లో తలపడినప్పుడు నా ముఖంపైన పంచ్ పడటంతో భయపడ్డాను. నిరంతర సాధనతో ప్రస్తుతం నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
‘చదువులోనూ శ్రద్ధ..’
నా పేరు నిభా కుమారి. స్కూల్‌లో సహచరులు రోజూ సాయంత్రం శిక్షణ తీసుకుంటుంటే.. నాకూ హాజరు కావాలని అనిపించింది. అలా క్రమక్రమంగా మెలకువలు నేర్చుకొని, అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నా. పోటీల్లో పాల్గొనడంతో నాపై నాకు నమ్మకం పెరిగింది. అదే శ్రద్ధ చదువులోనూ బాగా ఉపయోగపడుతోంది.
‘క్రమశిక్షణ అలవడింది..’
నా పేరు రేవతి. రోజూ సాధన చేస్తుండటంతో క్రమశిక్షణ అలవడింది. ఇప్పటికే అనేక పోటీల్లో పతకాలు గెలుచుకున్నాను. వివిధ ప్రాంతాలకు వెళ్లివస్తుండటంతో బయటి ప్రపంచంపైనా అవగాహన ఏర్పడుతోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Rohit - IPL: ఐపీఎల్లో ఆటగాళ్ల పనిభారంపై ఫ్రాంచైజీలదే బాధ్యత: రోహిత్ శర్మ
-
Movies News
Social Look: సారా అలీఖాన్ ‘పింక్’ మూడ్.. తుపాకీ పట్టిన లక్ష్మీరాయ్!
-
Crime News
Hyderabad: అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది డేటా.. ఆరుగురి అరెస్టు
-
General News
Polavaram: ‘పోలవరం’ ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం: కేంద్రం
-
Movies News
Shakuntalam: అప్పటి నుంచే నా సినిమాల్లో నిజమైన బంగారు ఆభరణాలు వాడుతున్నా: గుణశేఖర్
-
Politics News
Revanth Reddy: లీకేజీ వ్యవహారం.. కేటీఆర్ నుంచి ఎందుకు సమాచారాన్ని సేకరించలేదు?: రేవంత్