హరిత భవనం...పర్యావరణ హితం

భాగ్యనగరంలో హరిత భవనాల (గ్రీన్‌ బిల్డింగ్స్‌)కు ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు నగరంలో చాలా అరుదుగా ఉన్న భవనాలు ఇప్పుడు విస్తరిస్తున్నాయి. సుస్థిర అభివృద్ధిలో వీటి భాగస్వామ్యం ఎంతో ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులన్నీ ఇండియన్‌ గ్రీన్‌

Updated : 18 Jul 2020 02:51 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: భాగ్యనగరంలో హరిత భవనాల (గ్రీన్‌ బిల్డింగ్స్‌)కు ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు నగరంలో చాలా అరుదుగా ఉన్న భవనాలు ఇప్పుడు విస్తరిస్తున్నాయి. సుస్థిర అభివృద్ధిలో వీటి భాగస్వామ్యం ఎంతో ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులన్నీ ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్స్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ)లో నమోదై ఉన్నాయి. ఇందులో వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, ఐటీ పార్కులు, విద్యాసంస్థల భవనాలు, పరిశ్రమలు ఉన్నాయి. పర్యావరణ అనుకూలమైన హరిత భవనాల గురించి ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్కిటెక్ట్స్‌ (ఐఐఏ) ఆధ్వర్యంలో ఇటీవల ఏర్పాటుచేసిన ‘ట్రాన్సెండ్‌-2020’ వర్చువల్‌ కార్యక్రమంలో సైతం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రస్తావించారు. పరిమితంగా ఉన్న వనరులను కాపాడుకోవడంతో పాటు పర్యావరణానికి నష్టం కలిగించని రీతిలో భవనాల నిర్మాణం ఇప్పుడు అనివార్యమన్నది నిపుణుల మాట. పర్యావరణ పరంగా, ఆర్థికంగా పరిమిత వనరులను ఖర్చుచేయడమేగాక విద్యుత్‌ 30-40శాతం, నీరు 20-30శాతం తక్కువగా వినియోగించుకోవడం, భవనాలను పచ్చదనంతో ఆహ్లాదభరితం చేయడం వంటి ప్రయోజనాలతో గ్రీన్‌బిల్డింగ్‌ నమూనా రూపొందింది. ఈ పద్ధతిలో తొలి నిర్మాణం హైదరాబాద్‌లోనే సాగిందని ఇదే సదస్సులో గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ చాప్టర్‌ ప్రతినిధులకు పలు పురస్కారాలూ వరించాయి. ఆర్కిటెక్ట్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో ప్రొఫెసర్‌ ప్రమోద్‌షిండేకు మాధవ్‌ అచ్వల్‌ గోల్డ్‌ మెడల్‌, ఐఐఏలో విశేష సేవలందించిన దివంగత ఆర్కిటెక్ట్‌ ముజఫర్‌ అలీఖాన్‌కు ప్రెసిడెంట్‌ ట్రోఫీ లభించింది. ఆర్కిటెక్ట్‌లు సందీప్‌ నాయుడు, ఆశా గౌరిబిదనూర్‌లకు ‘ది సర్టిఫికెట్‌ ఆఫ్‌ మెరిట్‌’ లభించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని