భవిష్యత్తులో విలువ పెరిగే చోట..

ఇళ్ల ఎంపికలో చాలా అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసమే కాకుండా ఆ ప్రాంతంలో కొంటే భవిష్యత్తులో ఇంటి విలువ పెరుగుతుందా? అద్దె ఎంత వస్తుంది వంటి అంశాలు కొనుగోలులో నిర్ణయాంశాలుగా మారాయి.

Updated : 15 Feb 2020 01:59 IST

ఈనాడు, హైదరాబాద్‌

ఇళ్ల ఎంపికలో చాలా అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసమే కాకుండా ఆ ప్రాంతంలో కొంటే భవిష్యత్తులో ఇంటి విలువ పెరుగుతుందా? అద్దె ఎంత వస్తుంది వంటి అంశాలు కొనుగోలులో నిర్ణయాంశాలుగా మారాయి. పనిచేసే ప్రదేశానికి ఇల్లు దూరం కావడంతో చాలామంది సొంతిళ్లలో నివాసం ఉండలేని పరిస్థితి. ట్రాఫిక్‌, పిల్లల చదువు వంటి కారణాలతో తమ ఇల్లు అద్దెకిచ్చి కార్యాలయానికి దగ్గర్లో అద్దెకుండే వారు ఎక్కువగా ఉంటున్నారు. వీరు కొనే ఇల్లు ధర, సౌకర్యాలతో పాటూ అద్దె ఎంత వస్తుందనే దాన్ని ప్రధానంగా చూస్తున్నారు. వచ్చే అద్దెలను బట్టే కొనాలా.. వద్దా అనే నిర్ణయానికి వస్తున్నారు.
* రెండు పడక గదుల ఫ్లాట్‌ను రుణం ద్వారా తీసుకుంటే చెల్లించే ఈఎంఐ, వచ్చే అద్దెను లెక్కలేసుకుంటున్నారు. చాలావరకు ఈ రెండు పొంతనే ఉండవు. భవిష్యత్తులో ఆస్తి విలువ మాత్రం పెరగడం ఖాయమని గత అనుభవాలు చెబుతున్నాయి.
* శివార్లలో రహదారులు, ప్రజారవాణా అందుబాటులో ఉంటే నిరభ్యంతరంగా ఇల్లు, ఫ్లాటును కొనుగోలు చేయవచ్చు. ప్రభుత్వ పరంగా ఏవైనా భారీ ప్రాజెక్టులు వచ్చే ప్రాంతాల్లోనూ వృద్ధికి అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రాంతాల్లో అద్దె కూడా ఎక్కువే వస్తుంది. ఎప్పుడు విక్రయించినా మంచి ధరనే వస్తుంది.
* అద్దె అధికంగా వచ్చే ఆవాసాలు కావాలంటే గేటెడ్‌ కమ్యూనిటీల్లో కొనుగోలు చేయడం మేలు. రెండు పడకల గదికి రూ.పదివేల వరకు ఇక్కడ అద్దె వస్తోంది. కొనుగోలు సమయంలో ధర కూడా కాస్తా ఎక్కువే చెల్లించాల్సి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని