ముందస్తు ఒప్పందాల్లో అగ్రపథం

దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులకు తోడు.. కొవిడ్‌-19 మార్కెట్లను వణికిస్తోంది. ఇలాంటి తరుణంలో కార్యాలయ లీజింగ్‌ ముందస్తు ఒప్పందాలు హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో పెద్ద ఊరట. 2020లో దేశవ్యాప్తంగా

Updated : 14 Mar 2020 04:02 IST

2020లోనూ కార్యాలయ నిర్మాణాల జోరు
ఈనాడు, హైదరాబాద్‌

దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులకు తోడు.. కొవిడ్‌-19 మార్కెట్లను వణికిస్తోంది. ఇలాంటి తరుణంలో కార్యాలయ లీజింగ్‌ ముందస్తు ఒప్పందాలు హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో పెద్ద ఊరట. 2020లో దేశవ్యాప్తంగా 47.5 మిలియన్‌ చదరపు అడుగుల కార్యాలయ స్థలం నిర్మాణంలో ఉండగా 30 శాతం వరకు ముందస్తు బుకింగ్‌ అయ్యాయని జేఎల్‌ఎల్‌ నివేదికలో పేర్కొంది. హైదరాబాద్‌లో 11.9 మి.చ.అ. నిర్మాణంలో ఉండగా దేశంలోనే అత్యధికంగా 53 శాతం ముందే బుక్‌ అయ్యాయి.

దేశవ్యాప్తంగా గతేడాది గ్రేడ్‌-ఏ ఆఫీస్‌ స్పేస్‌ 52 మిలియన్‌ చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టగా 46 మిలియన్‌ చ.అ. వరకు లీజింగ్‌ జరిగింది. రికార్డు స్థాయి నిర్మాణం, లీజింగ్‌తో ఈ ఏడాది ముందస్తు బుకింగ్స్‌ ఆశాజనకంగా 30 శాతం వరకు నమోదయ్యాయి. ఇదే సెంటిమెంట్‌ కొనసాగుతుందనే అంచనాలతో ఈ ఏడాది చివరినాటికి లీజింగ్‌ 40 మి.చ.అ. దాటుతుందని అంచనా వేస్తున్నారు. గత ఐదేళ్ల సగటు 35 మిలియన్‌ చదరపు అడుగుల కంటే ఈ ఏడాది లీజింగ్‌ ఎక్కువగా ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిర్మాణాల విస్తీర్ణం స్వల్పంగా తగ్గింది. 47.5 మిలియన్‌ చదరపు అడుగులకు పరిమితమైంది. ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల వాటానే 50 శాతం పైన ఉంది.  ఫైనాన్స్‌ సంస్థలు, కోవర్కింగ్‌ కార్యాలయాల వాటా కూడా 26 శాతం వరకు ఉంది. సహజంగానే హైదరాబాద్‌కు ఎక్కువ కంపెనీలు వస్తుండడంతో ఇక్కడ కొత్త కార్యాలయాల ముందస్తు బుకింగ్‌ శాతం దేశవ్యాప్తంగా పోలిస్తే అధికంగా ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని