వేలంలో ఇంటి అమ్మకాలు

ప్రభుత్వ భూములను వేలంలో విక్రయిస్తున్నారు.. బ్యాంకులు సైతం రుణాలు ఎగ్గొట్టిన ఖాతాదారుల స్థిరాస్తులను వేలం వేస్తుంటాయి. అదే ఇళ్లు, ఫ్లాట్లను యాజమాని ఒక ధర వస్తే విక్రయించేస్తానని అమ్మకానికి పెడుతుంటారు.

Updated : 20 Nov 2021 06:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ భూములను వేలంలో విక్రయిస్తున్నారు.. బ్యాంకులు సైతం రుణాలు ఎగ్గొట్టిన ఖాతాదారుల స్థిరాస్తులను వేలం వేస్తుంటాయి. అదే ఇళ్లు, ఫ్లాట్లను యాజమాని ఒక ధర వస్తే విక్రయించేస్తానని అమ్మకానికి పెడుతుంటారు. అమ్ముతున్నట్లు ఎక్కువ మందికి తెలిస్తే మంచి ధర వస్తుందని పత్రికల్లో ప్రకటనలు ఇస్తుంటారు. ఎక్కువ మంది మధ్యవర్తులకు చెబుతుంటారు. ఇప్పుడు ఇంటి విక్రయాల్లోనూ రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీలు ప్రవేశించడంతో అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లకు సైతం వేలం వేస్తున్నాయి. ఆసక్తికల్గిన కొనుగోలుదారులు బిడ్స్‌ దాఖలు చేయాలని కోరుతున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్‌ సంస్థలకు చెందిన  ఫ్లాట్లను విక్రయించేటప్పుడు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు