రియల్టీపై ఇంటి నుంచి పని ప్రభావం?

ఇంటి నుంచి పనిచేయడం(రిమోట్‌), వారంలో మూడు రోజులు కార్యాలయం.. రెండు రోజులు ఇష్టమున్న చోట నుంచి (హైబ్రిడ్‌) పని ...

Published : 08 May 2021 03:26 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటి నుంచి పనిచేయడం(రిమోట్‌), వారంలో మూడు రోజులు కార్యాలయం.. రెండు రోజులు ఇష్టమున్న చోట నుంచి (హైబ్రిడ్‌) పని విధానంపై స్థిరాస్తి సంస్థలు అచితూచి స్పందిస్తున్నాయి. కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఐటీ కార్యాలయాలు తమ ఉద్యోగుల్లో అత్యధికశాతం మందికి ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాయి. కొవిడ్‌ తగ్గిన తర్వాత కూడా ఇదే కొనసాగే అవకాశం ఉంది. తాజాగా గూగుల్‌ సంస్థ హైబ్రిడ్‌ విధానంలో తమ ఉద్యోగులు పనిచేసే అవకాశాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది.మున్ముందు మరిన్ని బహుళజాతి సంస్థలు ఇదే విధానాన్ని అవలంబించే అవకాశం లేకపోలేదు. ఈ ప్రభావం కార్యాలయాల నిర్మాణంపై ఏ మేరకు ఉంటుందనే దానిపై రియల్టీ రంగంలో చర్చనీయాంశంగా మారింది.  కొవిడ్‌ అనంతర పోకడలు.. రిమోట్‌, హైబ్రిడ్‌ పనివిధానం ప్రభావంపై,  మరికొంతకాలం గడిస్తే తప్ప స్పందించలేం అంటున్నాయి.
లండన్‌లో ఇళ్లుగా మారుస్తున్నారు...  లండన్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో కార్యాలయాలు చాలావరకు ఖాళీ అయ్యాయి. ప్రపంచంలోని ప్రధానమైన పలు కంపెనీలకు ఈ ప్రాంతం అడ్డా. కొవిడ్‌ అనంతర పరిణామాలతో రిమోట్‌, హైబ్రిడ్‌ పనివిధానంతో ఇప్పుడు ఉన్న కార్యాలయాలు సైతం  ఎక్కువకాలం కొనసాగే అవకాశం లేదని లండన్‌ నగర కార్పొరేషన్‌ అంచనా వేస్తోంది. శాశ్వతంగా రిమోట్‌ పనివిధానంపై ఉద్యోగులు ఆసక్తి చూపిస్తుండటంతో ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ప్రైమ్‌ రియల్‌ ఎస్టేట్‌ ఖాళీగా మారింది. ఈ కార్యాలయాలను  1500 వరకు గృహాలుగా మార్చనున్నట్లు అక్కడి కార్పొరేషన్‌ ఇటీవల ప్రకటించింది. ఎప్పటికప్పుడు మారుతున్న అవసరాలకు అనుగుణంగా స్థిరమైన, సౌకర్యవంతమైన భవనాలను ప్రోత్సహించేందుకు స్థిరాస్తి రంగంతో కలిసి పనిచేస్తామని తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని