రక్షణనిచ్చే రుచులు!
పండ్లంటే నోరూరించే రుచులు... పోషకాల ఖజానాలు...తక్షణ శక్తినిచ్చే పానీయాలు... అంతేకాదండోయ్! కాస్త వెరైటీగా తయారు చేస్తే...మండే ఎండల్లో మేనికి చల్లదనాన్నిస్తాయి...జబ్బుల నుంచి రక్షణనిచ్చే కవచాలుగా మారతాయి...వివిధ రకాల పండ్లతో ఆ లాభాలు పొందడం ఎలాగంటే...
మామిడి పండుతో..
కావాల్సినవి: మగ్గిన మామిడి పండు- ఒకటి, కొబ్బరినీళ్లు- కప్పు, తేనె- చెంచా, పుదీనా ఆకులు- నాలుగైదు.
తయారీ: మామిడిపండు ముక్కలను మిక్సీలో వేసి, కాసిన్ని కొబ్బరినీళ్లు పోసి జ్యూస్ చేసుకోవాలి. దీన్ని గ్లాసులోకి తీసుకుని తేనె కలిపి పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకుంటే తియ్యతియ్యటి జ్యూస్ రెడీ.
ఆమ్ కా పన్నా..
కావాల్సినవి: మామిడికాయ- ఒకటి, బెల్లం- అర కప్పు, మిరియాలు- చెంచా, యాలకులు- నాలుగు, నల్లుప్పు- చెంచా, జీలకర్రపొడి- చెంచా, పుదీనా ఆకులు- గుప్పెడు, చల్లటి నీళ్లు- తగినన్ని.
తయారీ: మామిడి కాయను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి నీళ్లు పోసి ఐదారు కూతలు వచ్చేవరకు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత తొక్క తీసి లోపలి గుజ్జును మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి. (మామిడికాయలో విటమిన్-సి మెండుగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తి పెంపులో తోడ్పడుతుంది.) ఇప్పుడు మరో గిన్నెను స్టవ్ మీద పెట్టి పొయ్యి వెలిగించాలి. కాసిన్ని నీళ్లు పోసి బెల్లం వేసి మెల్లగా కలపాలి. అర కప్పు మామిడికాయ గుజ్జుకు కప్పు బెల్లం సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఆ ద్రవాన్ని వేరొక పాత్రలోకి వడకట్టాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టి అది వేడయ్యాక మామిడికాయ గుజ్జు వేసి కలపాలి. దీంట్లో బెల్లం నీళ్లు కలపాలి. ఇందులో కచ్చాపచ్చాగా దంచిన మిరియాల పొడి, యాలకులు, నల్లుప్పు వేసి గడ్డలు లేకుండా బాగా కలపాలి. దీన్ని సీసాలో నిల్వ చేసుకుని కావాల్సినప్పుడల్లా వాడుకోవచ్చు.
డ్రింక్ తయారీ... గ్లాసు నీళ్లలో రెండు మూడు చెంచాల ఆమ్ కా పన్నా కలిపి పుదీనా వేసి తీసుకుంటే ‘ఆహా ఏం రుచి’ అని అనకుండా ఉండలేరు.
నిమ్మ, సబ్జా గింజలతో..
కావాల్సినవి: నిమ్మరసం- రెండు పెద్ద చెంచాలు, పుదీనా ఆకులు- నాలుగైదు, మిరియాల పొడి- పావు చెంచా, ఉప్పు- అరచెంచా, నీళ్లు- కప్పున్నర, సబ్జాగింజలు- రెండు చెంచాలు.
తయారీ: గిన్నెలో నీళ్లు తీసుకుని నిమ్మరసం, పుదీనా ఆకులు, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి ఓసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరో గ్లాసులో నానబెట్టిన సబ్జాగింజలు వేసి తయారుచేసి పెట్టుకున్న నిమ్మరసాన్ని పోయాలి. అంతే రుచికరమైన పుల్లపుల్లని, చల్లచల్లని నిమ్మరసం రెడీ.
ఫ్రూట్ మాక్‌టెయిల్...
కావాల్సినవి: అరకప్పు చొప్పున పైనాపిల్, పుచ్చకాయ, మామిడిపండు ముక్కలు, నీళ్లు -తగినన్ని, తేనె- రెండు చెంచాలు.
తయారీ: ఈ ముక్కలన్నింటినీ వేసి కొన్ని నీళ్లు పోసి బ్లెండ్ చేసుకుని జ్యూస్‌ను వడకట్టుకోవాలి. ఇందులో కాస్తంత తేనె కలిపి తాగితే చాలా బాగుంటుంది. ఈ పండ్లలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఆరోగ్యాన్నిస్తాయి.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: ఫొటోతో అగ్గిరాజేసేలా రాశీఖన్నా.. అనుపమ ప్రచార సందడి
-
General News
EV charging station: హైదరాబాద్ చుట్టుపక్కల 330 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు.. ప్రయోగాత్మకంగా ఇక్కడే!
-
Politics News
Bhatti Vikramarka: మోదీజీ... తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారు: భట్టి విక్రమార్క
-
General News
Bribary Case: రూ.350 లంచం కేసు.. 24 ఏళ్లకు నిర్దోషిగా తేలిన మాజీ పోలీసు అధికారి
-
Movies News
KGF Avinash: కేజీయఫ్ విలన్‌కు రోడ్డు ప్రమాదం... మీ ప్రేమ వల్ల బతికా: అవినాశ్
-
World News
PM Modi: పుతిన్‌కు మోదీ ఫోన్.. ఏం చర్చించారంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs ENG: ఆదుకున్నపంత్, జడేజా.. తొలిరోజు ముగిసిన ఆట
- Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య
- Pakistan: అగ్ర దేశాలకు ‘డంపింగ్ యార్డు’గా మారిన పాకిస్థాన్!
- Chile: సాధారణ ఉద్యోగి ఖాతాలో కోటిన్నర జీతం.. రాజీనామా చేసి పరార్!
- Presidential Election: రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మూ గెలుపు ఖాయమే..! మమతా బెనర్జీ
- Ketaki Chitale: పోలీసులు నన్ను వేధించారు.. కొట్టారు: కేతకి చితాలే
- Meena: అసత్య ప్రచారం ఆపండి.. మీనా భావోద్వేగ లేఖ
- Single-Use Plastic: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా