వంటింట్లో ఆ మూడు!

మన పెరడు లేదా బాల్కనీలో కొన్ని రకాల మొక్కలను పెంచడం ద్వారా శారీరక, మానసిక, ఆరోగ్యపరమైన లాభాలెన్నో పొందవచ్చు. వాటిలో కొన్ని...

Published : 01 Mar 2020 00:48 IST

పోషకాలమ్‌

మన పెరడు లేదా బాల్కనీలో కొన్ని రకాల మొక్కలను పెంచడం ద్వారా శారీరక, మానసిక, ఆరోగ్యపరమైన లాభాలెన్నో పొందవచ్చు. వాటిలో కొన్ని...
పుదీనా

రుచి, సువాసన కోసం వాడతారు. మింట్‌ లీఫ్‌ అంటారు. దీంట్లోని పెప్పర్‌మింట్‌ సుగంధ తైలాలకు ఔషధ గుణాలున్నాయి.
* పుదీనా చలువ చేసి శరీర వేడిని తగ్గిస్తుంది.
* పుదీనా రసంలో శొంఠి, జీలకర్ర పొడి వేసి భోజనానికి ముందు తీసుకుంటే ఆకలి పెరుగుతుంది.
* ఈ రసంలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.
* ఈ రసంలో వాము పొడి కలిపి తాగితే కడుపులో నులి పురుగులు ఉంటే చచ్చి పడిపోతాయి.
* దీంతో రక్తంలోని హిమోగ్లోబిన్‌ స్థాయులు పెరుగుతాయి. పుదీనాలో ఉండే సల్ఫర్‌ ఊపిరితిత్తులకు రక్షణనిస్తుంది. చర్మవ్యాధులు రాకుండా కాపాడుతుంది.


కొత్తిమీర

చలువ చేసి, తల తిప్పడం తగ్గిస్తుంది. దీంట్లో విటమిన్‌ ఎ, బి1, బి2, సి ఉంటాయి.  కొలెస్ట్రాల్‌ని తగ్గించే గుణం దీనికి ఉంది.
* జీర్ణ వ్యవస్థను సక్రమంగా ఉంచుతుంది. కడుపులో వాయువు పెరగకుండా చేస్తుంది.
* దీన్ని మజ్జిగలో కలిపి తాగితే జ్వరం తీవ్రత తగ్గుతుంది.
* పైత్య వికారం తగ్గించడానికి అల్లం, కొత్తిమీర రసం మజ్జిగలో కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
* దీని రసం తాగితే నోట్లో పుండ్లు, చిగుళ్లవాపు త్వరగా తగ్గుతాయి.
* ఆకలి తగ్గినప్పుడు కొత్తిమీర రసం, శొంఠి, నిమ్మరసం, తేనెలను నీళ్లలో కలిపి తీసుకుంటే బాగా ఆకలి వేస్తుంది.
* ఈ రసం మూత్ర విసర్జన సాఫీగా కావడానికి సాయపడుతుంది. శరీర వాపులను తగ్గిస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది. అధిక రుతుస్రావాన్ని నియంత్రిస్తుంది.


కరివేపాకు

* మధుమేహం ఉన్నవాళ్లు చెంచా కరివేపాకు పొడిని ఆహారంతోపాటు తీసుకుంటే రక్తంలో చక్కెర శాతం కొంత తగ్గుతుంది.
* కరివేపాకు చారు, కషాయం తీసుకుంటే తలనొప్పి, ఒత్తిడి తగ్గుతాయి.
* ఈ పొడిని అరచెంచా చొప్పున తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి.
* పాదాలు, కాళ్లు వాచినప్పుడు కరివేపాకు కషాయం తాగితే త్వరగా వాపులు తగ్గే అవకాశం ఉంది.
* కొద్దిగా ఇంగువ, చెంచా కరివేపాకు పొడిని నెలసరికి ముందు వారం రోజులపాటు తీసుకుంటే పొత్తికడుపు నొప్పి తగ్గుతుంది.
*  చిన్నపిల్లలకు కరివేపాకు తినిపిస్తే ఎముకల సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
* చిగుళ్లవాపు ఉన్నవారు వీటి లేత ఆకులను నమిలితే సమస్య తగ్గడంతోపాటు నోటిపూత తగ్గుతుంది.
* దీంట్లో కాల్షియం, విటమిన్‌-ఎ, బి, సి ఎక్కువగా ఉంటాయి.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని