పాలు విరగకుండాఉండాలంటే

ఈ మధ్య పాలు తరచూ విరిగిపోతున్నాయి. ఇలా పాలు పాడవకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?వేసవిలో పాలు త్వరగా విరిగి పోతుంటాయి. ఇలా కాకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు...

Published : 23 May 2021 00:29 IST

ప్రశ్న - సమాధానం

ఈ మధ్య పాలు తరచూ విరిగిపోతున్నాయి. ఇలా పాలు పాడవకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? -రమ్య, హైదరాబాద్‌
వేసవిలో పాలు త్వరగా విరిగి పోతుంటాయి. ఇలా కాకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు...
* పాలు కొన్న వెంటనే కాచి పెట్టుకోవాలి. ఒక్క పొంగుతో ఆపకుండా రెండు, మూడు పొంగులు వచ్చేవరకూ కాచాలి.
* కాచిన పాలను వాడుకోగా మిగిలిన వాటిని చల్లారిన వెంటనే ఫ్రిజ్‌లో పెట్టేయాలి.
* కాచిన పాలను ఎండ తగిలే చోట పెట్టొద్దు. ఇలా చేస్తే వాటిలోని పోషకాలు పోతాయి.
* కాచిన గిన్నెలోనే పాలను ఉంచెయ్యండి. గిన్నెలు మార్చొద్దు.
* మీకు కావాల్సినన్ని పాలను వేరే గిన్నెలోకి తీసుకుని వాడుకోవాలే తప్ప పదే పదే మొత్తం పాలను వేడి చేయొద్దు.
* పాలను మందమైన అడుగు ఉన్న గిన్నెలో, సన్నని మంటపై వేడి చేయాలి. పాలు కాచే ముందు గిన్నెలో కాసిన్ని నీళ్లు పోసి వేడి చేసి పారబోయాలి.
* పాలగిన్నెను ఫ్రిజ్‌లోని అరల్లో పెట్టాలి. డోర్‌ ర్యాక్‌లో పెట్టొద్దు
* మిగిలిన పాలను కొత్త పాలతో కలపొద్దు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని