గోలీ ఇడ్లీలు

బియ్యప్పిండి, నీళ్లు- ఒకటిన్నర కప్పుల చొప్పున, ఉప్పు- తగినంత, వెన్న- పెద్ద చెంచా, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, జీలకర్ర, ఆవాలు- అర చెంచా, సెనగపప్పు, మినప్పప్పు- చెంచా చొప్పున, ఎండుమిర్చి- రెండు

Updated : 04 Jul 2021 06:10 IST

కావాల్సినవి
బియ్యప్పిండి, నీళ్లు- ఒకటిన్నర కప్పుల చొప్పున, ఉప్పు- తగినంత, వెన్న- పెద్ద చెంచా, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, జీలకర్ర, ఆవాలు- అర చెంచా, సెనగపప్పు, మినప్పప్పు- చెంచా చొప్పున, ఎండుమిర్చి- రెండు, ఇంగువ- చిటికెడు, కరివేపాకు- కొద్దిగా, అల్లం తురుము- చెంచా, కొత్తిమీర తురుము- పెద్ద చెంచా.

తయారీ
కడాయిలో నీళ్లు పోసి మరిగించాలి. ఆ నీటిలో ఉప్పు, వెన్న వేసి కలపాలి. బియ్యప్పిండిని వేస్తూ ఉండలు లేకుండా బాగా కలపాలి. రెండు మూడు నిమిషాలపాటు మూతపెట్టి అలాగే మగ్గనివ్వాలి. పిండి కాస్త చల్లారిన తర్వాత  మరోసారి బాగా కలిపి చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. వీటిని పదినిమిషాలపాటు ఇడ్లీ కుక్కర్‌లో పెట్టి ఆవిరిపై ఉడికించాలి.
పొయ్యిపై పాన్‌ పెట్టి నెయ్యి వేయాలి. ఇందులో సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం, ఇంగువ తాలింపు వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇడ్లీలు కలిపి రెండు నిమిషాలపాటు మూతపెట్టి మగ్గనివ్వాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసి వేడి వేడిగా పల్లీ, కొబ్బరిచట్నీతో తింటే సరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని