పిజ్జా, పాస్తాలను క్షణాల్లో చేస్తుంది!

ఇండోర్‌.. సరఫా బజార్‌లోని ప్రియాంకా పిజ్జా సెంటర్‌... ఎప్పుడు చూసినా జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. అక్కడో అమ్మాయి క్షణం తీరిక లేకుండా పిజ్జాలను తయారుచేస్తూనే ఉంటుంది. ఆమే

Published : 29 Aug 2021 00:41 IST

ఇండోర్‌.. సరఫా బజార్‌లోని ప్రియాంకా పిజ్జా సెంటర్‌... ఎప్పుడు చూసినా జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. అక్కడో అమ్మాయి క్షణం తీరిక లేకుండా పిజ్జాలను తయారుచేస్తూనే ఉంటుంది. ఆమే ప్రియాంక. అయితే వైట్‌ పాస్తా తయారుచేయడంలో ఆమె ప్రత్యేకతే వేరు.

ఇక్కడ రుచికరమైన పిజ్జా, పరాఠా, పాస్తా, శాండ్‌విచ్‌... ఇలా రకరకాలు దొరుకుతాయి. దాంతో చిన్నాపెద్దా చాలామంది ఇక్కడకు తరచూ వస్తుంటారు. పిజ్జా తయారుచేయడం, టాపింగ్‌ వంటివి క్షణాల్లో చేసేస్తుందామె. రుచి కూడా అదిరిపోతుంది. ధరలు కూడా అందుబాటులో ఉంటాయి. అయిదేళ్లుగా ఇక్కడ దీన్ని నిర్వహిస్తోందామె. ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రన్‌ చేస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని