కారం కారంగా.. కార్న్‌ రిబ్స్‌

స్వీట్‌కార్న్‌ కండెలు- రెండు, కారం- చెంచా, వెల్లుల్లి ముద్ద- అర చెంచా, నిమ్మరసం- పెద్ద చెంచా, ఉప్పు- తగినంత, నూనె- వేయించడానికి సరిపడా.

Published : 19 Sep 2021 02:32 IST

కావాల్సినవి: స్వీట్‌కార్న్‌ కండెలు- రెండు, కారం- చెంచా, వెల్లుల్లి ముద్ద- అర చెంచా, నిమ్మరసం- పెద్ద చెంచా, ఉప్పు- తగినంత, నూనె- వేయించడానికి సరిపడా.

తయారీ: మొక్కజొన్న కండెలను స్టీమర్‌లో పది నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత నాలుగు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. గిన్నెలో ఉప్పు, కారం, వెల్లుల్లి పేస్ట్‌, నిమ్మరసం, నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కంకులకు పట్టించి పది నిమిషాలపాటు పక్కన పెట్టాలి. పాన్‌లో నూనె పోసి మీడియం మంటపై వేడి చేయాలి. వేడెక్కిన నూనెలో మసాలా పట్టించిన కంకులు క్రిస్పీ అయ్యేవరకు వేయించాలి. ఆ తర్వాత కొద్దిసేపు టిష్యూపేపర్‌ పై వేయాలి. వీటిని పళ్లెంలోకి తీసుకుని కొద్దిగా కారం చల్లి వేడివేడిగా తింటే బాగుంటాయి.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని