జలపాత హోరు... రుచుల జోరు!

కొత్త ప్రాంతాలను చూడాలనుకునే పర్యాటకులకు బాగా నచ్చే ప్రదేశం... లాబాస్సిన్‌ వాటర్‌ ఫాల్‌ రెస్టారెంట్‌.. ఫిలిప్పీన్స్‌లోని ఈ వాటర్‌ఫాల్‌ రెస్టారెంట్‌ని టియాంగ్‌లోని విల్లా ....

Updated : 28 Nov 2021 06:52 IST

కొత్త ప్రాంతాలను చూడాలనుకునే పర్యాటకులకు బాగా నచ్చే ప్రదేశం... లాబాస్సిన్‌ వాటర్‌ ఫాల్‌ రెస్టారెంట్‌.. ఫిలిప్పీన్స్‌లోని ఈ వాటర్‌ఫాల్‌ రెస్టారెంట్‌ని టియాంగ్‌లోని విల్లా ఎస్కుడెరో రిసార్ట్‌ నిర్వహిస్తోంది. మానవ నిర్మితమైన ఈ వాటర్‌ ఫాల్‌ టూరిస్ట్‌లను విశేషంగా ఆకట్టుకుంటోంది.  దీని ప్రత్యేకత ఏమిటంటే దీంట్లోనే వెదురుతో చేసిన బల్లలపై ఎంచక్కా కూర్చొని  ఓ వైపు జల కళను చూస్తూ.. మధురమైన సంగీతాన్ని ఆస్వాదిస్తూ... మరోవైపు అక్కడి స్థానిక సీ ఫుడ్‌ను ఆరగించవచ్చు. నచ్చినవాళ్లు నీటిలో ఈత కొడుతూ, ఆటపాటల్లో మునిగి తేలుతుంటే.. మరికొందరు అక్కడి అందాలను తమ కెమెరాల్లో బంధిస్తూ ఆనందిస్తారు. బాగుంది కదూ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని