మహీంద్రా మెచ్చిన జిలేబీ

సాధారణంగా పారిశ్రామికవేత్తలంటే వ్యాపారలావాదేవీల గురించే మాట్లాడతారనుకుంటాం. కానీ ఆనంద్‌ మహీంద్రా  ఇందుకు పూర్తి భిన్నం. ఆయన రూపాయి ఇడ్లీని కూడా ఇష్టపడతారు. స్ట్రీట్‌ఫుడ్‌

Published : 22 May 2022 00:46 IST

సాధారణంగా పారిశ్రామికవేత్తలంటే వ్యాపారలావాదేవీల గురించే మాట్లాడతారనుకుంటాం. కానీ ఆనంద్‌ మహీంద్రా  ఇందుకు పూర్తి భిన్నం. ఆయన రూపాయి ఇడ్లీని కూడా ఇష్టపడతారు. స్ట్రీట్‌ఫుడ్‌ గురించి ఆసక్తిగా తెలుసుకుంటారు. ఇంతకు మించిన ఆహారప్రియుడు ఎవరుంటారు? ట్విటర్‌ వేదికగా ఆయన పరిచయం చేసిన ఆసక్తికర వంటకాల్లో కొన్ని..

రూపాయి ఇడ్లీ: తమిళనాడులో ఇడ్లీఅమ్మగా పేరొందిన 85 ఏళ్ల కమలాతల్‌ రూపాయికే ఇడ్లీ అందిస్తారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ ధర పెంచని ఆమె గురించి ప్రపంచానికి తెలియచెప్పింది ఆనంద్‌ మహీంద్రానే. ఇల్లు కూడా కట్టించి ఇచ్చారు.


అమృత్‌సర్‌ జిలేబి: స్వర్ణదేవాలయానికి దగ్గరగా ఉండే గురుదాస్‌రామ్‌ జిలేబీ మించిన రుచి ప్రపంచంలోనే నేనెక్కడా చూడలేదని అంటారు మహీంద్రా. పూర్తిగా నెయ్యితో చేసే ఈ జిలేబీకి ఎంత డిమాండ్‌ అంటే దసరా రోజుల్లో క్యూలో నిల్చుంటే ఒక్కోసారి మనవరకూ రాకుండానే జిలేబీ అయిపోయేంత.


ఐస్‌క్రీం దోసె: స్ట్రీట్‌ఫుడ్‌ని అమ్మేవారి సృజనాత్మకతను మెచ్చుకుంటూ ఐస్‌క్రీం దోసె మంచి ప్రయోగం అంటారాయన. కానీ దానిని తినడానికి మాత్రం వెనకాడతారట.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని