బలాన్నిచ్చే ధామ్‌ కీ దాల్‌

మనం శనగలతో ఛోలే చేస్తాం కదా! హిమాచల్‌ప్రదేశ్‌ వాసులు శనగపప్పుతో చేసే ‘ధామ్‌ కీ దాల్‌’ కొంచెం అలాంటిదే. ఎంతో సులువుగా తయారయ్యే ఈ వంటకం జబర్దస్త్‌గా ఉంటుందంటూ ఇష్టంగా తింటారు. ముఖ్యంగా చలికాలం వేగంగా చేసుకుని వేడి వేడిగా తింటుంటారు.

Published : 04 Feb 2024 00:03 IST

నం శనగలతో ఛోలే చేస్తాం కదా! హిమాచల్‌ప్రదేశ్‌ వాసులు శనగపప్పుతో చేసే ‘ధామ్‌ కీ దాల్‌’ కొంచెం అలాంటిదే. ఎంతో సులువుగా తయారయ్యే ఈ వంటకం జబర్దస్త్‌గా ఉంటుందంటూ ఇష్టంగా తింటారు. ముఖ్యంగా చలికాలం వేగంగా చేసుకుని వేడి వేడిగా తింటుంటారు. ఇంతకీ దీన్నెలా చేయాలంటే... ముందుగా శనగపప్పును నాలుగు గంటలు నానబెట్టి, ఉడికించాలి. ఉడుకుతున్నప్పుడు వచ్చే నురుగు తెట్టె కట్టినట్టవుతుంది. దాన్ని తీసేస్తుండాలి. అందులో చెంచా చొప్పున సోంపు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, అర కప్పు ఉల్లి తరుగు, తగినంత ఉప్పు, ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌ ఆవాల నూనె, ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి వేసి కలియబెట్టాలి. ఒక పాత్రలో అర గ్లాసు నీళ్లు పోసి.. అందులో పావు చెంచా చొప్పున జాజికాయ పొడి, మెంతుల పొడి, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, కారం, అర చెంచా చొప్పున ఛోలే మసాలా, మిరియాల పొడి, పావు చెంచా యాలకుల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి.. ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న పప్పులో వేయాలి. మరో పావుగంట సన్న సెగ మీద ఉడికించి, రెండు చెంచాల నెయ్యి జతచేసి.. దించేయాలి. అంతే టేస్టీ టేస్టీ ధామ్‌ కీ దాల్‌ తయారైపోతుంది. ఇది రుచికరమే కాదు, మంచి పోషకాహారం కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని