రసబలీ.. తిన్నారా?

ఒడియా ప్రసిద్ధ పిండివంటల్లో ‘రసబలీ’ మిఠాయి ఒకటి. దీన్నెలా చేయాలంటే.. అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో రెండు కప్పుల పాలు పోసి, కాస్త కుంకుమ పువ్వు వేయాలి

Published : 11 Feb 2024 01:11 IST

ఒడియా ప్రసిద్ధ పిండివంటల్లో ‘రసబలీ’ మిఠాయి ఒకటి. దీన్నెలా చేయాలంటే.. అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో రెండు కప్పుల పాలు పోసి, కాస్త కుంకుమ పువ్వు వేయాలి. సన్న సెగ మీద పాలు సగం అయ్యేవరకూ మరిగించాలి. అందులో అర కప్పు పంచదార వేసి.. అది కరిగాక, పావు చెంచా యాలకుల పొడి వేసి.. కలియ తిప్పి దించేయాలి. మరో పాత్రలో కప్పు తురిమిన పనీర్‌, చెంచా చొప్పున ఉప్మా రవ్వ, గోధుమ పిండి వేసి బాగా కలిపితే.. మెత్తటి పిండిలా తయారవుతుంది. దాన్ని నిమ్మకాయంత భాగాలుగా చేసి, టిక్కీలుగా ఒత్తుకోవాలి. సైజు, మందం అన్నీ సమానంగా ఉండేట్లు చేసి, కాగుతున్న నూనెలో బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి. వీటిని టిష్యూ పేపర్‌ మీదికి తీస్తే.. అదనంగా ఉన్న నూనె పీల్చేసుకుంటాయి. ఈ టిక్కీస్‌ను మరిగించిన పాలలో వేయాలి. అరగంట నానితే సరి.. తియ్యటి ‘రసబలీ మిఠాయి’ సిద్ధమైపోతుంది. సులువైన ఈ స్వీటు సూపర్‌ టేస్టీగా ఉంటుంది. తిని ఆనందించడమే తరువాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు