పెరుగు బాగా తోడుకోవాలంటే...
మా అమ్మ పెరుగు తోడు పెడితే.. గడ్డ పెరుగు తోడుకొనేది. కమ్మగా ఉండేది. నేను ఇంట్లో పెరుగు తోడుపెడుతుంటే గడ్డకట్టడం లేదు సరికదా... పుల్లటి వాసన వస్తోంది. దీనికేమైనా చిట్కాలుంటాయా?
కొవ్వు తీయని పాలను తోడుపెట్టుకుంటే పెరుగు చిక్కగా, రుచిగా వస్తుంది. తోడుపెట్టేటప్పుడు పాలు మరీ చల్లగా, మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉండేట్టు జాగ్రత్తపడాలి. పాలల్లో పెరుగుని కలిపి అలాగే వదిలేయకూడదు. ఒక గిన్నెలోంచి మరో గిన్నెలోకి తోడు పూర్తిగా కలిసేటట్టు తప్పనిసరిగా నురుగు వచ్చేవరకూ అటూఇటూ నాలుగైదు సార్లు అనాలి. ఇలా అయితేనే గట్టిగా తోడుకుంటుంది. తోడుకోసం పుల్లని పెరుగుని వాడొద్దు. స్టీలు గిన్నెల్లో కన్నా మట్టి పాత్రల్లో అయితే పెరుగు కమ్మగా రుచిగా వస్తుంది. మాడిపోయిన పాలని వాడితే పెరుగు వాసన వస్తుంది. తినలేం. అలాగే తోడు పెట్టాక ఒక ఎండు మిర్చి వేసినా పెరుగు గట్టిగా వస్తుంది.
జవాజీ లోక్‌నాథ్, చెఫ్, హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
ఉదయం ప్రజాప్రతినిధి.. మధ్యాహ్నం కూలీ
-
Sports News
ధోని కెప్టెన్సీ పేలవం: టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్
-
Movies News
భయపెట్టేందుకు బరిలోకి ఎన్టీఆర్
-
World News
Saeed Rashed: నాలుగేళ్ల కుర్రాడు.. రికార్డు సృష్టించాడు
-
World News
US Man: అతడికి డబ్బు ఖర్చుపెట్టడమంటే అలర్జీ అట..!
-
World News
UNSC: రష్యా చేతికి యూఎన్ఎస్సీ పగ్గాలు.. ‘చెత్త జోక్’గా పేర్కొన్న ఉక్రెయిన్!