కరకరలాడే కచోరీలు...
నాకు కచోరీలంటే చాలా ఇష్టం. కానీ వీటిని ఎలా చేసుకోవాలో తెలియదు. తేలిగ్గా చేసుకొనే పద్ధతి చెబుతారా?
నాకు కచోరీలంటే చాలా ఇష్టం. కానీ వీటిని ఎలా చేసుకోవాలో తెలియదు. తేలిగ్గా చేసుకొనే పద్ధతి చెబుతారా?
వర్ణిక, మెదక్
కావల్సినవి: మైదా- రెండు కప్పులు, బొంబాయి రవ్వ- కప్పు, ఉప్పు- తగినంత, బేకింగ్ సోడా- చిటికెడు, నూనె- డీప్ ఫ్రైకి సరిపడా, బంగాళదుంపలు- నాలుగు ఉడికించి మెదపాలి, అల్లం తురుము- చెంచా, జీలకర్ర- చెంచా, ధనియాలపొడి- చెంచా, ఆమ్ చూర్ పొడి- చెంచా, గరం మసాల- చెంచా, కొత్తిమీర- కొద్దిగా.
తయారీ: మైదాపిండిలో రవ్వ, ఉప్పు, రెండు చెంచాల నూనె, సోడా వేసి గోరువెచ్చని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. దీన్ని అరగంట పాటు పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం బాణలీ తీసుకొని దాంట్లో రెండు చెంచాల నూనె తీసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, ఆమ్‌చూర్ పౌడర్, మసాల, బంగాళదుంపలు, కొద్దిగా ఉప్పు వేసుకొని కలపాలి. మైదాపిండిని నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకొని చేతిలో చపాతీల్లా వత్తుకోవాలి. దాని మధ్యలో బంగాళదుంప మిశ్రమం పెట్టి వేళ్లతో చుట్టూ మూసేయాలి. తర్వాత ఈ ముద్దని స్టఫింగ్ బయటకు రాకుండా కట్‌లెట్‌లాగా వత్తుకోవాలి. డీప్ ఫ్రైకి నూనె కాగనిచ్చి ఒకొక్కటీ దాంట్లో వేసుకొని వేగనివ్వాలి. ఎర్రగా వేగిన తర్వాత తీసుకొని ఇష్టమైన చట్నీతో కరకరలాడే కచోరీలు సర్వ్ చేసుకోవటమే.
చెఫ్ పవన్, హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
పెద్ద నోట్లకు ఆశపడితే ఉన్న నోట్లు జారిపాయే!.. రాజానగరంలో సినీఫక్కీలో రూ. 50 లక్షల చోరీ
-
World News
కోర్టు బోనెక్కనున్న బ్రిటన్ రాకుమారుడు..
-
Ap-top-news News
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
India News
అరిహాను స్వదేశానికి పంపండి.. మూడేళ్ల పాప కోసం జర్మనీపై భారత్ ఒత్తిడి
-
India News
పెద్దమనసు చాటుకున్న దీదీ
-
Ts-top-news News
రీజినల్ పాస్పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు