రంధ్రాల సొరకాయ కూర

పేరు కొంచెం చిత్రంగా ఉంది కదూ! ఈ కూర అంతకంటే అద్భుతమైన రుచితో పసందుగా ఉంటుంది. ఇది మా అమ్మమ్మ స్పెషల్‌. ఆవిడ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను.

Updated : 06 Aug 2023 01:22 IST

పేరు కొంచెం చిత్రంగా ఉంది కదూ! ఈ కూర అంతకంటే అద్భుతమైన రుచితో పసందుగా ఉంటుంది. ఇది మా అమ్మమ్మ స్పెషల్‌. ఆవిడ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. దీన్నెలా చేయా లంటే.. మొదట లేత సొరకాయనే ఎంచుకోవాలి, అలాగే నూనె కొంచెం ఎక్కువే వేయాలి. ముందుగా సొరకాయను కడిగి ఒక పెద్ద పాత్రలో ఉంచి ఫోర్క్‌తో కొంచెం దగ్గర దగ్గరగా గుచ్చి రంధ్రాలు చేసి పక్కన ఉంచాలి. కొంతసేపటికి కాయలోంచి నీరు బయటకు వస్తుంది. కడాయిలో నూనె కాగిన తర్వాత లవంగాలు, దాల్చినచెక్క, తాలింపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముద్ద, ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత నీరు దిగిన సొరకాయను ముక్కలుగా కోసి, వేయాలి. అవి ఉడికాయనుకున్నాక కొద్దిగా చింతపండు గుజ్జు వేసి, కొన్ని నీళ్లు పోసి మరో ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, బెల్లం పొడి వేయాలి. మరో రెండు నిమిషాలు సన్న సెగ మీద ఉడికించి దింపేస్తే సరి ఘుమఘుమలాడే రంధ్రాల సొరకాయ కూర రెడీ. సొరకాయకు రంధ్రాలు చేయడం కొంచెం కష్టమే కానీ.. కూర తయారయ్యాక అందరూ సంతోషంగా తినడం చూస్తే ఆ శ్రమ లెక్కలోకే రాదనిపిస్తుంది. ఈ సొరకాయ కూర మీరూ ప్రయత్నించండి.. చాలా నచ్చుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని