క్యారెట్‌.. కళ్లకే కాదు, ఎముకలకూ మంచిది!

క్యారెట్‌ తింటే కంటిచూపు మెరుగుపడుతుందని తెలియని పిల్లలుండరు.. ఎందుకంటే అమ్మలందరూ అదే చెప్పి, వాళ్లతో తినిపిస్తారు కాబట్టి. నిజానికి క్యారెట్లతో ఆ ఒక్కటే కాదు.. ఇంకెన్నో లాభాలున్నాయి. కెరొటిన్‌, పీచు, పొటాషియం, కాల్షియం కెలొరీలు, ప్రొటీన్లు, పిండిపదార్థాలు, విటమిన్లతో ఇది మంచి పోషకాహారం.

Published : 24 Dec 2023 00:14 IST

క్యారెట్‌ తింటే కంటిచూపు మెరుగుపడుతుందని తెలియని పిల్లలుండరు.. ఎందుకంటే అమ్మలందరూ అదే చెప్పి, వాళ్లతో తినిపిస్తారు కాబట్టి. నిజానికి క్యారెట్లతో ఆ ఒక్కటే కాదు.. ఇంకెన్నో లాభాలున్నాయి. కెరొటిన్‌, పీచు, పొటాషియం, కాల్షియం కెలొరీలు, ప్రొటీన్లు, పిండిపదార్థాలు, విటమిన్లతో ఇది మంచి పోషకాహారం. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు వ్యాధి నిరోధకంగా పనిచేస్తాయి. ఇవి రక్తంలో చెక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. రక్తపోటును, గుండె జబ్బులను నిరోధిస్తాయి. జీర్ణ ప్రక్రియలో అపసవ్యతలుంటే తగ్గిపోతాయి. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయి. క్యారెట్లు తినేవారిలో ఎముకలు పటిష్టంగా ఉంటాయి. ఊబకాయం బారిన పడనివ్వవు. క్యారెట్‌ నమలడం నోటికి మంచి వ్యాయామం. వీటితో దంతాలు దృఢంగా ఉంటాయి. ఇక కళ్లకు చాలా మంచిదన్న సంగతి తెలిసిందే కదా! కళ్లద్దాలు రాకుండా ఉండాలంటే క్యారెట్లు తప్పకుండా తింటుండాలి. అచ్చంగా క్యారెట్‌ కూరే చేయొచ్చు. లేదా క్యాలీఫ్లవర్‌, పచ్చి బఠాణీలు, క్యాబేజ్‌లతో కలిపి వండొచ్చు. చిన్న ముక్కలుగా కోసి.. రెండు చుక్కల నిమ్మరసం వేసుకుని తినొచ్చు. తీపి ఇష్టపడేవారు క్యారెట్లను తురిమి కాస్త తేనె లేదా పంచదార జతచేసి తినొచ్చు. వృద్ధులకు జ్యూస్‌ రూపంలో లేదా ఉడికించి ఇవ్వొచ్చు. ఇన్ని ప్రయోజనాలున్న క్యారెట్లను ఏదో రూపంలో తరచూ తిందామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని