కమ్మని వాసనల నిమ్మ!
కూరలు లేదా పచ్చళ్లు పుల్లగా ఉండాలంటే సాధారణంగా మనం చింతపండు లేదా నిమ్మరసం వాడతాం. కానీ బెంగాలీలు మాత్రం ఈ రెండూ వేయరు. కాస్త ‘గంధొరాజ్ లెబు’ రసం వంటకాల్లో వాడతారు...
పొరుగింటి పసందు
కూరలు లేదా పచ్చళ్లు పుల్లగా ఉండాలంటే సాధారణంగా మనం చింతపండు లేదా నిమ్మరసం వాడతాం. కానీ బెంగాలీలు మాత్రం ఈ రెండూ వేయరు. కాస్త ‘గంధొరాజ్ లెబు’ రసం వంటకాల్లో వాడతారు. దీన్నే ‘రంగాపుర్ లైమ్’ అనికూడా అంటారు. ఈ నిమ్మకాయ ముదురాకుపచ్చ రంగులో ఉండి, తొక్క దళసరిగా ఉంటుంది. బెంగాల్లో మాత్రమే పండే ఈ నిమ్మకాయ సువాసనే వేరు. అంతచక్కని సువాసన వస్తుంది కాబట్టే దీనికి ‘గంధరాజ్’ అనీ వాడుక భాషలో ‘గంధొరాజ్’ అనే పేరు వచ్చింది. పెరట్లో ఈ చెట్టొకటి ఉంటే చాలనుకుంటారు బెంగాలీలు. ఇది సాధారణ నిమ్మకాయలా గుండ్రంగా కాకుండా కోలగా ఉంటుంది. అందుకే దీన్ని నిలువుగానే కోస్తారు. ‘చేపలు, మాంసాహార వంటకాలు అందుబాటులో లేనప్పుడు... వేడివేడి దంపుడు బియ్యం అన్నంలో కాస్త పెసరపప్పు కలిపి, రెండు చుక్కల గంధొరాజ్ రసం పిండుకుని, బంగాళాదుంపల వేపుడు నంజుకుంటే చాలు... స్వర్గానికి అడుగు దూరంలో ఉన్నట్టే ఉంటుంది’ అంటారు భోజన ప్రియులు. మటన్, చికెన్, చేపల కూరలు, వేపుళ్ల రుచి అమాంతం పెరిగిపోవాలంటే వాటిల్లో కాస్త గంధొరాజ్ రసం పడాల్సిందేనంటారు అక్కడి పాకశాస్త్ర నిపుణులు. ఈ కాయ వెదజల్లే సువాసనలు ఎక్కడున్నవాళ్లనైనా డైనింగ్ టేబుల్ దగ్గరకు లాక్కొచ్చేస్తాయంటారు దీని రుచి తెలిసినవాళ్లు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హౌస్‌కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
IPL 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌కు బెయిల్
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM