వెల్లుల్లి కోసం...

శాండ్‌విచ్‌లు చేయడానికీ, సలాడ్లలోకి, బటర్‌లోకీ వెల్లుల్లిని రోస్ట్‌ చేస్తుంటాం. అయితే వీటిని పొయ్యి మీద కాల్చడం కాస్త కష్టమే. అలాగని అవెన్‌లో వేడిచేస్తే అవెన్‌ మొత్తం వెల్లుల్లి వాసన వస్తుంటుంది. అలా కాకుండా సులభంగా వెల్లుల్లిని కాల్చాలనుకొనేవారికి

Updated : 14 Aug 2022 03:28 IST

శాండ్‌విచ్‌లు చేయడానికీ, సలాడ్లలోకి, బటర్‌లోకీ వెల్లుల్లిని రోస్ట్‌ చేస్తుంటాం. అయితే వీటిని పొయ్యి మీద కాల్చడం కాస్త కష్టమే. అలాగని అవెన్‌లో వేడిచేస్తే అవెన్‌ మొత్తం వెల్లుల్లి వాసన వస్తుంటుంది. అలా కాకుండా సులభంగా వెల్లుల్లిని కాల్చాలనుకొనేవారికి ఉపయోగపడే పరికరమే ఈ గార్లిక్‌ రోస్టర్‌. ఈ ఎలక్ట్రానిక్‌ పరికరంలో... వెల్లుల్లి చివర్లు కత్తిరించి కాస్త ఆవనూనెకానీ, ఇతర వంట నూనె కానీ వేసి మూతపెట్టేస్తే చాలు. చక్కగా కాలతాయి. ఉపయోగించుకోవడానికి అనువుగా ఉంటాయి. ఎలక్ట్రానిక్‌ కాకుండా టెర్రాకోట, ఇనుముతో చేసిన రోస్టర్లు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని