మతిమరపు రానీయదు..

దీపావళి అంటే మిఠాయిలు. వాటిల్లో కుంకుమ పువ్వు వేస్తే ఇక ఆ రంగు, రుచి గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. సుగంధ దినుసుల్లో ఒక్కటిగా చెప్పుకొనే కుంకుమపువ్వు ఔషధ గుణాల్లోనూ వెనక్కి తగ్గదు.

Published : 16 Oct 2022 00:19 IST

దీపావళి అంటే మిఠాయిలు. వాటిల్లో కుంకుమ పువ్వు వేస్తే ఇక ఆ రంగు, రుచి గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. సుగంధ దినుసుల్లో ఒక్కటిగా చెప్పుకొనే కుంకుమపువ్వు ఔషధ గుణాల్లోనూ వెనక్కి తగ్గదు. నికార్సయిన కుంకుమపువ్వుతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...
సుగంధ ద్రవ్యాల్లో చాలామటుకు వేడినూనెలో వేసి వేయించినప్పుడే వాటిల్లోని సుగుణాలు బయటకు వస్తాయి. కారణం కొవ్వులో కరిగితేనే వాటిల్లోని ప్రత్యేక గుణాలు బయటకు వస్తాయి. కుంకుమపువ్వు అలా కాదు.. చల్లని నీళ్లలో నానబెట్టినా దానిలో క్రోసిన్‌ అనే కెరోటిన్‌ విడుదలై ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ క్రోసిన్‌కి వివిధ రకాల క్యాన్సర్లని అదుపు చేసే శక్తి ఉంది. కుంకుమపువ్వులోని ప్రత్యేక గుణాలు ఒవేరియన్‌, లుకేమియా, కొలెన్‌ క్యాన్సర్‌ కణాలని కంతులుగా మారకుండా అడ్డుకుంటాయి.

* వయసుతో పాటు వచ్చే మతిమరపుని అడ్డుకుని జ్ఞాపకశక్తి పెంచడానికి కుంకుమపువ్వు మంచి ఔషధం. అందుకే జపాన్‌లో పార్కిన్‌సన్‌, అల్జీమర్స్‌, డిమెన్షియా వ్యాధులతో బాధపడేవారికి దీన్ని క్యాప్సూల్‌ రూపంలో అందిస్తుంటారు.
* కొంతమంది ఆడపిల్లలు కౌమారంలో అడుగుపెట్టినా రజస్వల కావడం ఆలస్యం అవుతుంది. అటువంటి పిల్లలకు పాలల్లో వేసిన కుంకుమ పువ్వు ఇవ్వడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తగ్గి నెలసరులు మొదలవుతాయి.
* రాత్రి నిదురించే ముందు తాగడంవల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. జ్వరం, జలుబు వంటి సమస్యలుంటే వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది.
* వంటల్లో వాడే ప్రమాదకర సింథటిక్‌ రంగులకు ఇంతకు మించిన ప్రత్యామ్నాయం లేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని