ఈ గరిటెలు తేలతాయి...

ఫ్లోటింగ్‌ కట్లరీ అదేనండీ నీటిలో తేలియాడే వంట సామాను గురించి తెలుసా? అయితే చదవండి. వంట చేయడం, తినడం వరకూ బాగానే ఉంటుంది.

Published : 01 Jan 2023 02:18 IST

ఫ్లోటింగ్‌ కట్లరీ అదేనండీ నీటిలో తేలియాడే వంట సామాను గురించి తెలుసా? అయితే చదవండి. వంట చేయడం, తినడం వరకూ బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఉంటుంది అసలు పని. పాత్రలన్నీ సింకులో వేస్తాం. ఇక వాటిల్లో వ్యర్థాలు సింకు రంధ్రానికి అడ్డంపడి.. నీళ్లు నిల్వ ఉండిపోతాయి. వాటిల్లో మనం ముందుగా వేసిన చెంచాలు అడుగున ఉండిపోతాయి. ఆ ఎంగిళ్లలో చేతులుపెట్టి తీయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఫ్లోటింగ్‌ కట్లరీతో ఆ బాధ ఉండదట. ఎందుకంటే ఈ చెంచాలు, గరిటెలు నీటిలో తేలతాయి కాబట్టి. అంతేకాదు పెద్ద పాత్రల్లో సూపులు చేస్తున్నప్పుడు గరిటెలు అందులో పడిపోతుంటాయి. వీటితో ఆ సమస్య ఉండదు. మీరు వదిలేసినా అవి పైకే తేలుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని