ఆమె పాడితే... లోకమే వండదా!

వంటని చేశామంటే చేసి మమ అనిపించడం ఒకెత్తు. వంటలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ చేయడం ఒక పద్ధతి. సావన్‌దత్తా వ్లోగ్‌(వీడియో ప్లస్‌ బ్లాగ్‌)ని చూస్తే వంటని ఇంత బాగా ఆడుతూ, పాడుతూ కూడా చేయొచ్చా? అని భోజన ప్రియులు నోరెళ్లబెట్టేస్తున్నారు.

Published : 01 Jul 2018 02:12 IST

నయాట్రెండు
ఆమె పాడితే... లోకమే వండదా!

వంటని చేశామంటే చేసి మమ అనిపించడం ఒకెత్తు. వంటలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ చేయడం ఒక పద్ధతి. సావన్‌దత్తా వ్లోగ్‌(వీడియో ప్లస్‌ బ్లాగ్‌)ని చూస్తే వంటని ఇంత బాగా ఆడుతూ, పాడుతూ కూడా చేయొచ్చా? అని భోజన ప్రియులు నోరెళ్లబెట్టేస్తున్నారు. ఇలిష్‌(మన పులస) కర్రీ, మచర్‌జోల్‌, ఆలూపోష్తో వంటి బెంగాలీ వంటకాలని సావన్‌దత్త్‌ పాడుతూ వండిన తీరు చూస్తే ‘ఆహా ఏమి రుచి’ అని పాడుకోక తప్పదు. అసలే నోరూరించే వంటకాలు, దానికి తోడు వంటకాలపై అద్భుతమైన సాహిత్యం... దానికి ఇంకా అందంగా పాడేతీరు మనల్ని ఇంకా ఇంకా నోరూరించేలా చేస్తాయి. ఒక్క బెంగాలీ వంటకాలే కాదు... అన్ని రకాల వంటకాలని సావన్‌ పాటల్లో వినాలనుకుంటే సావన్‌దత్తా. కామ్‌లోకి ఒక సారి తొంగి చూసేయండి మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు