పుట్టు కడల కర్రీ
పొరుగు రుచి
కేరళీయుల సంప్రదాయ వంటకాల్లో పుట్టు, కడల కర్రీ ఒకటి. ఈ వంటకాన్ని అక్కడి వారు చాలా ఇష్టపడతారు. బియ్యం రవ్వ, పచ్చికొబ్బరి తురుములను ఆవిరి మీద ఉడికించి ఈ పుట్టును తయారుచేస్తారు. గొట్టం లాంటి పాత్రలో దీన్ని వండటం వల్ల అదే ఆకారం దీనికి వస్తుంది. ఘుమఘుమలాడే పుట్టును మగ్గిన అరటి పండు, పచ్చికొబ్బరి తురుము, కడల కర్రీతో తింటారు.
కడల కర్రీ (సెనగల కూర)
కావాల్సినవి: సెనగలు- కప్పు, ఉల్లిపాయలు- రెండు, పసుపు- పావుచెంచా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం- రెండు చెంచాల చొప్పున, అల్లం వెల్లులి ముద్ద- చెంచా, ఉప్పు- తగినంత, పచ్చి కొబ్బరి - సగం ముక్క(సన్నగా తురమాలి), జీలకర్ర- అర చెంచా.
పోపు కోసం..
నూనె- తగినంత, ఆవాలు- పావు చెంచా, దాల్చిన చెక్క-ఒకట్రెండు, ఇలాచీ-మూడు, బిర్యానీ ఆకులు-రెండు, ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు, పచ్చిమిర్చి ముక్కలు- మూడు (నిలువుగా చీల్చుకోవాలి), కరివేపాకు- కొద్దిగా.
తయారీ: ముందు రోజు రాత్రే సెనగలను నానబెట్టాలి. పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టి నీళ్లు పోయాలి. ఇందులో నానబెట్టుకున్న సెనగలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, తగినంత ఉప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కలిపి కుక్కర్ మూత పెట్టేయాలి. నాలుగైదు కూతలు వచ్చిన తర్వాత మూత తీసి కలపాలి.
* మరో గిన్నెలో కొబ్బరి తురుము, జీలకర్ర, ఉడుకుతున్న సెనగల కూర రెండు గరిటెలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూరలో వేసుకోవాలి.
* మరో పొయ్యి మీద కడాయి పెట్టి నూనె పోయాలి. కాగిన తర్వాత ఆవాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఈ పోపును ఇందాక తయారుచేసిన కూరలో వేసి కలపాలి. అంతే సెనగల కూర సిద్ధం.
పుట్టు తయారీ ఇలా...
కావాల్సినవి: బియ్యం- కప్పు, ఉప్పు- తగినంత, నీళ్లు - కొన్ని, పచ్చికొబ్బరి తురుము- కప్పు
తయారీ: ఓ గిన్నెలో బియ్యాన్ని మూడు, నాలుగు గంటలపాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీళ్లు వడబోసి ఆరబెట్టి రవ్వలా మిక్సీ పట్టి, దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. చిన్న గిన్నెలో కాస్తంత ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి కలపాలి. ఈ నీటిని బియ్యం రవ్వలో పోస్తూ ఉండలు లేకుండా పొడి పొడిగా కలపాలి.
పుట్టు చేసే పాత్ర లోపలివైపు నూనె రాయాలి. మొదట బియ్యం రవ్వను ఒక పొరలా వేయాలి. ఆ తర్వాత కొబ్బరి తురుము... ఇలా మార్చి మార్చి పొరల్లా వేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్‌లా ఉండే దాంట్లో ఈ పాత్రను పెట్టి ఉడికించాలి. (దీనికోసం పుట్టు మేకర్, కుక్కర్ మార్కెట్లో దొరుకుతాయి. కేవలం పుట్టు మేకర్‌తో, మనింట్లో ఉండే కుక్కర్‌ను ఉపయోగించి కూడా చేయొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Amritpal Singh: ‘ఆపరేషన్ అమృత్‌పాల్’కు పక్షం రోజులు ముందే నిశ్శబ్దంగా ఏర్పాట్లు..!
-
Movies News
RRR: ‘ఆస్కార్’కు అందుకే వెళ్లలేదు.. ఆ ఖర్చు గురించి తెలియదు: ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత
-
Politics News
Andhra News: వైకాపాతో భాజపా కలిసిపోయిందనే ప్రచారం.. నష్టం చేసింది: భాజపా నేత మాధవ్
-
Movies News
Actress Hema: సెలబ్రిటీలపై అసత్య ప్రచారం.. సైబర్ క్రైమ్‌లో సినీనటి హేమ ఫిర్యాదు
-
India News
Manish Sisodia: భార్యకు అనారోగ్యం.. కొడుకు విదేశాల్లో.. బెయిల్ ఇవ్వండి: సిసోదియా
-
General News
Telangana Jobs: గుడ్ న్యూస్.. జీహెచ్ఎంసీ పరిధిలో 1,540 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్!