మెత్తగా రావెందుకు?

మా అత్తగారు వడలు చేస్తే మృదువుగా, రుచిగా ఉంటాయి. నేను చేస్తే గట్టిగా అనిపిస్తాయి. నూనె కూడా ఎక్కువగా పీల్చుకుంటాయి.

Published : 30 Oct 2022 00:15 IST

ప్ర: మా అత్తగారు వడలు చేస్తే మృదువుగా, రుచిగా ఉంటాయి. నేను చేస్తే గట్టిగా అనిపిస్తాయి. నూనె కూడా ఎక్కువగా పీల్చుకుంటాయి. వడలు మృదువుగా, నూనె పీల్చుకోకుండా ఉండాలంటే ఏమైనా చిట్కాలుంటాయా?

జ: నానబెట్టిన మినపప్పుని ఫ్రిజ్‌లో మూడు, నాలుగ్గంటలు ఉంచండి. వడలు వేయడానికి ముందు ఫ్రిజ్‌లోంచి తీయండి. రుబ్బేటప్పుడు నీళ్లు చిలకరిస్తారు కదా దానిక్కూడా చల్లని నీళ్లనే వాడండి. అలాగే ఉప్పు వేసి రుబ్బకూడదు. మెత్తగా రుబ్బుకున్న పిండిలో కొద్దిగా బియ్యప్పిండిని కలిపితే మృదువుగా వస్తాయి. నూనె వేడెక్కాక వడలు వేయడానికి ముందు ఉప్పు, ఉల్లిపాయలు, మిర్చి, కొత్తిమీర వంటివి కలపాలి. ముందు కలిపి ఉంచకూడదు. ఇలా అయితే నూనె పీల్చుకోకుండా మృదువుగా వస్తాయి.


విజయ్‌ కుమార్‌, చెఫ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని