ఆలూ కట్లెట్‌ రుచిగా రావాలంటే!

మాబాబుకి ఆలూ కట్లెట్‌ అంటే చాలా ఇష్టం. ఎన్నిసార్లు ప్రయత్నించినా గట్టిగా వస్తున్నాయి. రుచిగా ఉండటం లేదు. తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతారా?

Published : 05 Feb 2023 00:43 IST

మాబాబుకి ఆలూ కట్లెట్‌ అంటే చాలా ఇష్టం. ఎన్నిసార్లు ప్రయత్నించినా గట్టిగా వస్తున్నాయి. రుచిగా ఉండటం లేదు. తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతారా?

కావ్యశర్మ, హైదరాబాద్‌

లూ కట్లెట్‌ తయారీకి పాత బంగాళా దుంపల్ని ఎంచుకోండి. కొత్తవి జిగురుగా ఉండి అంత రుచిగా ఉండవు. ఇక స్టఫింగ్‌ కోసం పచ్చి బఠాణీలు మాత్రమే వాడుతుంటారు. దానికి ప్రత్యామ్నాయంగా స్వీట్‌కార్న్‌, పనీర్‌, చీజ్‌, ఉడికించిన సెనగపప్పుని కూడా వాడుకోవచ్చు. దీనివల్ల రుచి పెరుగుతుంది. ఇక... మొక్కజొన్నపిండి, బంగాళాదుంప పిండి, మైదావంటివి ఉడికించిన బంగాళాదుంపలకి జోడిస్తే చక్కని బైండింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తాయి. బ్రెడ్‌ క్రంబ్స్‌లో దొర్లించి వేయిస్తే తినేటప్పుడు కరకరలాడుతూ బాగుంటాయి. చాట్‌మసాలా, పుదీనా పొడి వంటివి చల్లితే భిన్నమైన రుచి వస్తుంది. ఫ్రిజ్‌లో కాసేపు ఉంచి తర్వాత ఈ కట్‌లెట్లని వేయించండి. ఇలా చేస్తే కరకరకలాడుతూ వస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని