చక్కీ కీ శాక్‌తో భలే మజా!

మధ్యప్రదేశ్‌లో ప్రముఖంగా వినిపించే వంటల్లో ‘చక్కీ కీ శాక్‌’ ఒకటి. ఎప్పుడూ చపాతీలేనా అని విసుగనిపించినప్పుడు.. అదే పిండితో ఇలా చేస్తారు. ఇదేం పెద్ద కష్టం కాదండోయ్‌..

Published : 08 Oct 2023 00:28 IST

ధ్యప్రదేశ్‌లో ప్రముఖంగా వినిపించే వంటల్లో ‘చక్కీ కీ శాక్‌’ ఒకటి. ఎప్పుడూ చపాతీలేనా అని విసుగనిపించినప్పుడు.. అదే పిండితో ఇలా చేస్తారు. ఇదేం పెద్ద కష్టం కాదండోయ్‌.. ముందుగా గోధుమ పిండిని చపాతీ పిండిలా మెత్తగా వచ్చేలా బాగా కలపాలి. అది కొంతసేపు నానిన తర్వాత.. చిన్న ముక్కలుగా చేసి ఆవిరి మీద ఉడికించాలి. వాటిని కొద్ది నూనెలో వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా జీలకర్ర, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో గుజ్జు వేయాలి. కాస్త ఉడికిన తర్వాత.. ధనియాల పొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, కసూరి మెంతి, కారం వేసి మూత పెట్టి గ్రేవీ తయారుచేయాలి. అందులో ముందు వేయించుకున్న గోధుమ పిండి ఫ్రైస్‌ వేసి.. సన్న సెగ మీద రెండు నిమిషాలు ఉడికించాలి. చివర్లో కాస్త కొత్తిమీర తరుగు వేసి దించేయాలి. అంతే.. నోరూరించే చక్కీ కీ శాక్‌ సిద్ధమైనట్లే. దీనికి పెరుగు కాంబినేషన్‌ మరింత రుచి తెస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని