కొబ్బరి నీళ్లతో ఇడ్లీ పూలు

ఇడ్లీ కనిపెట్టి ఎన్ని వందల ఏళ్లయ్యిందో కానీ.. వారంలో రెండుసార్లయినా తింటాం. నూనె, మైదా లాంటివి ఉండవు కనుక ఆరోగ్యం మరి! ఈ తరం పిల్లలు ‘ఎప్పుడూ ఇడ్లీనేనా?’ అనకుండా.. అందులో ప్రయోగాలు చేస్తుంటారు చాలామంది.

Updated : 08 Oct 2023 06:38 IST

డ్లీ కనిపెట్టి ఎన్ని వందల ఏళ్లయ్యిందో కానీ.. వారంలో రెండుసార్లయినా తింటాం. నూనె, మైదా లాంటివి ఉండవు కనుక ఆరోగ్యం మరి! ఈ తరం పిల్లలు ‘ఎప్పుడూ ఇడ్లీనేనా?’ అనకుండా.. అందులో ప్రయోగాలు చేస్తుంటారు చాలామంది. తాజాగా ముంబైలో ఓ ఫుడ్‌ వెండర్‌ ‘నారియల్‌ పానీ ఇడ్లీ’ అంటూ కొత్తరకం సృష్టించేశాడు. ఎలాగంటారా.. ఇడ్లీ పిండిలో కొబ్బరి నీళ్లు, కొంచెం కొబ్బరి కలిపాడు. పువ్వు ఆకృతిలో ఉన్న ప్లేటుల్లో పిండి వేసి ఆవిరి మీద ఉడికించాడు. ఆ ఇడ్లీల మీద లేత కొబ్బరి ముక్క, కెంపుల్లా మెరుపులు కురిపించే దానిమ్మ గింజలను అలంకరించి, అరటి ఆకులో సాంబారు, మూడు రకాల పచ్చళ్లు కూడా జతచేసి సర్వ్‌ చేస్తున్నాడు. పువ్వుల్లా ఆకర్షణీయంగా కనిపించడమే కాదు.. యమా రుచిగా ఉన్నాయంటూ తిన్నవాళ్లు ప్రశంసిస్తున్నారు. ఖరీదు మరీ ఎక్కువేమో అనుకుంటున్నారా? ఉహూ.. రూ.69 మాత్రమే. ఆ టేస్టు, క్రియెటివిటీకి ఎంతైనా చెల్లించవచ్చు అంటున్నారు ఆహార ప్రియులు. ‘ఎ బైట్‌ ఆఫ్‌ యమ్మీ’ పేరుతో పోస్టయిన ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. వారెవా అంటూ కితాబులిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని