వెజ్‌ స్టార్టర్‌ రుచిగా రావాలంటే...

పార్టీలకు వెళ్లినప్పుడు పిల్లలు వెజ్‌ లాలిపాప్‌ ఇష్టంగా తింటారు. అలాంటిది హోటల్‌ తరహాలో రుచిగా చేయడం ఎలాగో చెప్పండి!

Published : 15 Oct 2023 00:37 IST

పార్టీలకు వెళ్లినప్పుడు పిల్లలు వెజ్‌ లాలిపాప్‌ ఇష్టంగా తింటారు. అలాంటిది హోటల్‌ తరహాలో రుచిగా చేయడం ఎలాగో చెప్పండి!

  • వెజ్‌ స్టార్టర్‌ చేయాలనుకునేవారికి.. మిక్స్‌డ్‌ వెజ్‌ లాలిపాప్‌ బెస్ట్‌ రెసిపీ. అది మరింత రుచిగా రావాలంటే.. బ్రెడ్‌ పొడి ఉపయోగించాలి. ఇది మీకు రెడీమేడ్‌గా దొరుకుతుంది. అది వద్దనుకుంటే.. మిల్క్‌ బ్రెడ్‌ని ఎండబెట్టి లేదా పెనం మీద కాల్చి, అంచులు తీసేసి.. గ్రైండ్‌ చేసి వాడుకోండి.
  • క్యాబేజీ, క్యారట్‌, బీన్స్‌ ముక్కలను రెండు మూడు నిమిషాలు వేయించి, తర్వాత ఉడికించాలి. చల్లారిన వెజిటబుల్‌ మిక్స్‌ని చిన్న చిన్న బాల్స్‌గా చేసి అరగంట ఫ్రిజ్‌లో ఉంచండి. వాటిని మైదాపిండిలో ముంచి, బ్రెడ్‌ పొడిలో మూడు నాలుగుసార్లు కోట్‌ చేయండి. తర్వాత ఐస్‌ పుల్లను గుచ్చి.. నెమ్మదిగా ఆ పుల్లకి అంటుకునేలా బాల్‌ని జాగ్రత్తగా వత్తుకోవాలి.
  • లాలిపాప్స్‌ను బ్రెడ్‌ పొడిలో రోల్‌ చేసిన తర్వాత.. ఓ గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. అప్పుడవి గట్టి పడతాయ్‌. వాటిని నూనెలో వేయిస్తే పగలవు.
  • కాగిన నూనెలో వేసి రెండు నిమిషాలు కదపకుండా వదిలేయండి. తర్వాత  నిదానంగా గరిటెతో కలియ తిప్పుతూ వేయించండి. ఈ లాలిపాప్స్‌ వేడిగా తింటే మరింత బాగుంటాయి. టొమాటో సాస్‌, పుదీనా చట్నీ.. ఇలా దేనితో అయినా రుచిగా ఉంటాయి.
  • లాలిపాప్స్‌ను జిప్‌ లాక్‌ కవర్లో ఉంచి, డీప్‌ ఫ్రిజ్‌లో పెడితే.. నెల రోజులు నిలవుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని