రక్తపోటుకు స్ట్రాబెర్రీ!

పుల్లపుల్లగా, కాస్త వగరుగా ఉండే ఎర్రటి స్ట్రాబెర్రీ పండ్లను ఇష్టపడని వారుండరు. కేవలం రంగు, రుచే కాదు ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలనిస్తాయివి.

Published : 13 Mar 2022 00:52 IST

పుల్లపుల్లగా, కాస్త వగరుగా ఉండే ఎర్రటి స్ట్రాబెర్రీ పండ్లను ఇష్టపడని వారుండరు. కేవలం రంగు, రుచే కాదు ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలనిస్తాయివి.

కప్పు స్ట్రాబెర్రీ పండ్ల నుంచి 11 గ్రాముల పిండిపదార్థాలు, 3 గ్రా.,  ప్రొటీన్‌ అందుతాయి. కొవ్వులు చాలా తక్కువ. వీటి నుంచి 49 కెలొరీలు లభిస్తాయి. ఇందులోని విటమిన్‌-సి ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి వృద్ధాప్య ఛాయలను రాకుండా చూస్తుంది.  అలాగే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఈ పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి వీటిని తరచూ తీసుకుంటే  రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే జలుబు, ఫ్లూ లాంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. గుండెకు మేలు చేస్తాయి. కొవ్వును తగ్గించడంలో సాయపడతాయి. వీటిలోని విటమిన్‌-ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్ట్రాబెర్రీలను సలాడ్‌ రూపంలో తీసుకోవచ్చు. వీటిలోని పీచు జీర్ణక్రియ చక్కగా సాగేలా చేస్తుంది. మలబద్ధకం సమస్య ఉండదు. పిల్లలు, పెద్దలు, గర్భిణులు అందరూ తినొచ్చు. నేరుగా తింటే ప్రయోజనాలన్నీ అందుతాయి. ఎర్రగా నిగనిగలాడే ఈ పండ్లు తింటే చర్మం కాంతిమంతంగా మారుతుంది. ఈ పండులోని ఫ్లేవనాయిడ్స్‌ మెదడులో వాపులను తగ్గిస్తాయి. అలాగే వయసు రీత్యా వచ్చే మతిమరపును తొందరగా రానీయవు. దీంట్లోని  ఫోలేట్‌, విటమిన్‌-సి, ఫ్లేవనాయిడ్స్‌ క్యాన్సర్‌ రాకుండా అడ్డుకుంటాయి. ఇన్ని ప్రయోజనాలున్న దీన్ని తింటే సరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని