దంచేద్దాం.. రుచి పెంచేద్దాం.. కిచెన్‌ కింగ్‌ మసాలా ఇంట్లోనే

ఫలానా మసాలా పొడి వల్ల కూర సూపర్‌గా ఉంది- లాంటి ప్రకటనలు చూస్తుంటాం కదూ! అలాంటి వాటిల్లో ‘కిచెన్‌ కింగ్‌ మసాలా’ ఒకటి. ఇది బయట కొనేకంటే ఇంట్లోనే చేసుకుంటే మరింత తాజాగా ఉంటుంది.

Updated : 04 Feb 2024 04:20 IST

లానా మసాలా పొడి వల్ల కూర సూపర్‌గా ఉంది- లాంటి ప్రకటనలు చూస్తుంటాం కదూ! అలాంటి వాటిల్లో ‘కిచెన్‌ కింగ్‌ మసాలా’ ఒకటి. ఇది బయట కొనేకంటే ఇంట్లోనే చేసుకుంటే మరింత తాజాగా ఉంటుంది. ప్రిజర్వేటివ్స్‌ ఉండవు కనుక ఆరోగ్యానికీ మంచిది. తేలిగ్గా ఎలా చేయాలంటే.. మినప్పప్పు, పచ్చి శనగ పప్పు, షాహీ జీరా, ఆవాలు ఒక్కో చెంచా చొప్పున, మెంతులు పావు చెంచా, సోంపు 2 టేబుల్‌ స్పూన్లు, ధనియాలు 3 టేబుల్‌ స్పూన్లు, ఒకటిన్నర చెంచా జీలకర్రలను సన్న సెగ మీద వేయించాలి. అవి గోధుమ రంగులోకి మారేసరికి మంచి వాసన వస్తుంది. అందులో అంగుళం చొప్పున దాల్చినచెక్క, శొంఠి, మూడు బిర్యానీ ఆకులు, 12 లవంగాలు, 8 యాలకులు, 2 నల్ల యాలకులు (బ్లాక్‌ కార్డమమ్‌), ఒక జాపత్రి, ఒక స్టార్‌ మొగ్గ, అర జాజికాయ, 7 ఎండు మిరప కాయలు, అర టేబుల్‌స్పూన్‌ గసగసాలు, 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున మిరియాలు, మెంతి ఆకుల పొడి వేసి ఇంకాస్త వేయించాలి. మంచి సువాసన వస్తున్నప్పుడు దించేయాలి. అవి చల్లారాక.. చెంచా చొప్పున పసుపు, ఉప్పు, ఆమ్‌చూర్‌ పొడి జతచేసి గ్రైండ్‌ చేయాలి. అంతే.. ‘కిచెన్‌ కింగ్‌ మసాలా’ సిద్ధం. దీన్ని తడి లేని గాలి చొరబడని డబ్బాలో భద్రం చేసుకుంటే టొమాటో, బంగాళదుంప లాంటి కూరల దగ్గర నుంచి బిర్యానీ వరకూ ఎందులో వేసినా.. వారెవా అనిపిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని