రథసప్తమికి వంకాయ పచ్చడి!

 కొందరు వంట విసుగైన పని అనుకుంటారు కానీ.. నాకు చాలా ఇష్టం. నేనేం చేసినా మావాళ్లు తెగ మెచ్చుకుంటారు. బహుశా ఇష్టంగా మనసుపెట్టి చేయడమే అందుకు కారణమేమో! నా వంటల్లో వంకాయ పులుసు పచ్చడిని మీతో పంచుకుంటాను.

Published : 11 Feb 2024 01:33 IST

 కొందరు వంట విసుగైన పని అనుకుంటారు కానీ.. నాకు చాలా ఇష్టం. నేనేం చేసినా మావాళ్లు తెగ మెచ్చుకుంటారు. బహుశా ఇష్టంగా మనసుపెట్టి చేయడమే అందుకు కారణమేమో! నా వంటల్లో వంకాయ పులుసు పచ్చడిని మీతో పంచుకుంటాను. ఇదెలా చేయాలంటే.. ముందుగా చింతపండును తడిపి పెట్టాలి. ఆరేడు ఎండు మిరపకాయలు, చెంచా ఆవాలు, రెండు చెంచాల మినప్పప్పులను వేయించాలి. వంకాయలను పొయ్యి మీద అటూ ఇటూ తిప్పుతూ కాల్చాలి. చల్లారనిచ్చి.. పొట్టు తీసేసి, లోపలి గుజ్జును మెత్తగా మెదపాలి. అందులో కాస్త బెల్లం పొడి కలపాలి.

వేయించిన ఆవాలు, మినప్పప్పు, ఎండు మిరపకాయలకు చింతపండు, ఉప్పు జోడించి నూరి.. వంకాయ గుజ్జులో కలపాలి. ఇది మిక్సీ పట్టవచ్చు. కానీ రోట్లో చేస్తేనే మరింత రుచి. తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువలతో తాలింపు వేయాలి. అంతే ఘుమఘమలాడే కమ్మటి వంకాయ పులుసు పచ్చడి సిద్ధం. రుచినీ, ఆరోగ్యాన్నీ అందించే ఈ పచ్చడి ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే భోగి, రథ సప్తమి, ఏకాదశి, షష్ఠి వంటి తిథుల్లో కొందరు తరిగిన కూరగాయలు తినరు. అటువంటి సందర్భాల్లో చేసుకోవడానికి.. ఇది సులువైన వంటకం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని