weekly horoscope: రాశిఫలం (జులై 9 - జులై 15)

ఈ వారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 09 Jul 2023 02:18 IST


విజయం నిశ్చయం. ఉత్సాహంగా పని చేస్తే అనుకున్నది సాధిస్తారు. సంకల్పం దృఢంగా ఉండాలి. ఉద్యోగంలో ఉన్నతస్థితి గోచరిస్తోంది. తగిన కార్యాచరణ అవసరం. ఆర్థికంగా కలిసివస్తుంది. భూ గృహ వాహన యోగాలు ప్రాప్తిస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. గురుగ్రహశ్లోకం చదువుకోండి, మంచివార్తలు వింటారు.

విజయమే ధ్యేయంగా పనిచేయాలి. కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో ఏకాగ్రత అవసరం. ప్రశాంతంగా ఆలోచించి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లాలి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తిచేయాలి. అవసరాలకు ధనం అందుతుంది. పెట్టుబడులు కలిసివస్తాయి. చెడు ఊహించవద్దు. అపార్థాలకు తావివ్వవద్దు. ఇష్టదేవతను ధ్యానించండి, శక్తి లభిస్తుంది.


శ్రేష్ఠమైన కాలం. పలుమార్గాల్లో విజయం లభిస్తుంది. వ్యాపారంలో శుభయోగాలున్నాయి. స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన లాభం సిద్ధిస్తుంది. ధర్మమార్గంలో ధైర్యంగా ముందుకు సాగండి. అవరోధాలను అధిగమిస్తారు. ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. ఆశయం నెరవేరేవరకు కృషి చేస్తూనే ఉండాలి. లక్ష్మీదేవిని ధ్యానించండి, కుటుంబసభ్యులకు మేలు జరుగుతుంది.


ధనయోగం సూచితం. ఉద్యోగంలో సమస్యల్ని గతానుభవంతో పరిష్కరించాలి. చంచలత్వం ఇబ్బంది పెడుతుంది. మిత్రుల సలహాలు పనిచేస్తాయి. చిన్న పొరపాటు జరిగినా సమస్య జటిలమవుతుంది. కాలం వ్యతిరేకంగా ఉంది. పట్టువిడుపులతో ముందుకెళ్లాలి. ఏ పని చేసినా ఇంట్లో వారికి చెప్పిచేయాలి. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది.


ఉద్యోగంలో ఆశయం నెరవేరుతుంది. బాధ్యతాయుతంగా చేసే పనుల్లో విజయం ఉంటుంది. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి.పనులు వాయిదా వేయవద్దు. స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారం బాగుంటుంది. స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి. ఒక ఆపద నుంచి బయటపడతారు. ప్రయాణాలు కలిసివస్తాయి. విష్ణునామస్మరణ శక్తినిస్తుంది.


అద్భుతమైన శుభయోగాలున్నాయి. సకాలంలో పనులు పూర్తిచేయండి. ఎదురు చూస్తున్న విజయం లభిస్తుంది. ఉద్యోగంలో క్రమంగా ఉన్నతస్థితికి చేరతారు. అభీష్ట సిద్ధి ఉంది. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఎవరి మాటలూ పట్టించుకోవద్దు. లక్ష్యంపై దృష్టి నిలపండి. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభవార్తలు వింటారు.


ధర్మమార్గంలో వెళ్తే శ్రేయస్సు ఉంటుంది. ప్రయత్నబలాన్ని బట్టి ఫలితాలుంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఏకాగ్రత అవసరం. వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడు పూర్తిచేయాలి. ప్రణాళికలతోనే అనుకున్నది సాధించగలరు. భూ గృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. చేతిదాకా వచ్చిన ఒక పని మధ్యలో ఆగుతుంది. ఈశ్వరారాధన శుభాన్నిస్తుంది.


ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. పనులు ఆలస్యం అవుతాయి. గతానుభవంతో నిర్ణయాలు తీసుకోవాలి. అడుగడుగునా విఘ్నాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆత్మవిశ్వాసం అవసరం. ఆర్థిక నష్టాలు రాకుండా జాగ్రత్తవహించాలి. ఆవేశం పనికిరాదు. నవగ్రహ శ్లోకాలు చదివితే కార్యసిద్ధి లభిస్తుంది.


అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో సత్ఫలితాలు ఉంటాయి. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థికంగా కలిసివస్తుంది. స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి. ప్రశాంతంగా ఆలోచించి భవిష్యత్తుకోసం ప్రణాళికలు సిద్ధం చేయండి. పూర్వపుణ్యం సదా కాపాడుతుంది. వారం మధ్యలో ఒకపని పూర్తవుతుంది. శుభవార్త వింటారు. సూర్యనమస్కారం శక్తినిస్తుంది.


ఉద్యోగం బాగుంటుంది. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. అంచెలంచెలుగా పైకి వస్తారు. స్థిరమైన ఫలితాలు లభిస్తాయి. మేలుచేసేవారున్నారు. కొన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం లభిస్తుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఓర్పును పరీక్షించేవారున్నారు. అనుకున్నది సాధించేవరకూ కృషి కొనసాగించండి. కుజశ్లోకం చదువుకుంటే మంచిది.


వ్యాపార లాభాలున్నాయి. అభీష్టసిద్ధి కలుగుతుంది. మొహమాటం లేకుండా వ్యవహరిస్తే ఆర్థిక నష్టాన్ని నిరోధించవచ్చు. వివాదాలకు అవకాశం ఉంది. మనోభావాలను నొప్పించకుండా మాట్లాడాలి. సమష్టి నిర్ణయాలు మేలు. ధైర్యంగా ముందుకెళ్లాలి. ఉద్యోగంలో పనులు వాయిదా వేయవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభవార్త వింటారు.


ధర్మబద్ధంగా ముందుకెళ్లండి, గౌరవ ప్రదమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు ఉంటాయి. పనుల్ని మధ్యలో ఆపవద్దు. ముఖ్యవ్యక్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవాలి. ఇతరులకు ధనం ఇస్తే తిరిగి రాదు. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. విష్ణు సహస్రనామం చదువుకోండి, మంచి వార్త వింటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..