కర్తవ్యం

దానగుణ సంపన్నులనగానే శిబిచక్రవర్తి, కర్ణుడు గుర్తొస్తారు. శిబి.. ప్రాణభయంతో శరణువేడిన పావురాయిని రక్షించాడు. ఆకలిగొన్న డేగకు తన శరీరాన్నిచ్చాడు.

Updated : 14 Mar 2023 13:44 IST

దానగుణ సంపన్నులనగానే శిబిచక్రవర్తి, కర్ణుడు గుర్తొస్తారు. శిబి.. ప్రాణభయంతో శరణువేడిన పావురాయిని రక్షించాడు. ఆకలిగొన్న డేగకు తన శరీరాన్నిచ్చాడు. ‘ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నీ కవచకుండలాలను దానం అడుగుతాడు జాగ్రత్త!’ అంటూ సూర్యుడు ముందుగానే హెచ్చరించినా, కురుక్షేత్ర సంగ్రామం అనివార్యమని తెలిసినా.. తనను రక్షించే కవచకుండలాలను నిస్సంకోచంగా దానం చేశాడు కర్ణుడు.
ఆధునికయుగంలోనూ అలాంటి మహనీయులున్నారు. ఆకలి తీర్చే అన్నపూర్ణేశ్వరిగా ప్రసిద్ధి చెందిన డొక్కా సీతమ్మ ఒకసారి కాశీ వెళ్లేందుకు సిద్ధమైంది. దారిలో ఒక పసివాడు రోదిస్తోంటే ‘కొద్దిసేపు ఆగు, నాయనా! డొక్కా సీతమ్మ గారింటికి వెళ్తున్నాం, ఆమె నీ ఆకలి తీరుస్తుంది’ అంటూ ఓదారుస్తోంది తల్లి. ఆ మాటలు విన్న సీతమ్మ వెంటనే ఎడ్లబండిని వెనక్కి తిప్పమని ఇల్లు చేరింది. పాలు కాచి ఆ పసిబిడ్డ రాగానే లాలిస్తూ ఆకలి తీర్చింది. ఒక బిడ్డ ఆకలి తీర్చేందుకు జీవిత పరమార్థం అనుకున్న కాశీ ప్రయాణం విరమించుకుంది. దానశీలత అంత గొప్పది.
బెహరా ఉమామహేశ్వర రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని