‘నేను’ నశిస్తే మోక్షం

మహాజ్ఞాని అయిన జనక మహారాజు మోక్షం సిద్ధించే మార్గం చెప్పినవారికి రాజ్యంలో భాగమిస్తానని ప్రకటించాడు. విషయం తెలుసుకున్న ఓ మహర్షి గుర్రం ముందుకు జాపిన కాలును వెనుకకు తీసేంత వ్యవధిలో మోక్షమార్గం బోధిస్తానన్నాడు.

Published : 29 Jun 2023 00:10 IST

మహాజ్ఞాని అయిన జనక మహారాజు మోక్షం సిద్ధించే మార్గం చెప్పినవారికి రాజ్యంలో భాగమిస్తానని ప్రకటించాడు. విషయం తెలుసుకున్న ఓ మహర్షి గుర్రం ముందుకు జాపిన కాలును వెనుకకు తీసేంత వ్యవధిలో మోక్షమార్గం బోధిస్తానన్నాడు. అదంత సులువైతే రుషులు ఏళ్ల తరబడి ఎందుకు తపస్సు చేస్తున్నారని ఆశ్చర్యపోయాడు మహారాజు. ‘ముందు నేనడిగేదానికి జవాబిస్తే తమరి సందేహం తీరుస్తాను రాజా! నేను ఎప్పుడు మోక్షం పొందుతాను?- అన్నదే ప్రశ్న’ అన్నాడు మహర్షి. జనకుడు, సభలో ఉన్న పండితులు కూడా దానికి సమాధానం చెప్పలేకపోయారు. మహర్షి నవ్వి ‘రాజా! ప్రశ్నలోనే జవాబున్నా తమరు గ్రహించలేదు’ అన్నాడు. జనకుడు మళ్లీ ఆలోచించినా ఫలితం లేకపోయింది. ‘అహం ఉన్నంతవరకూ మోక్షం సాధ్యంకాదు. ప్రశ్నలో ముందున్న ‘నేను’ అనే రెండక్షరాల అహం నశిస్తే మోక్షం లభిస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా అదెంత సులువో?!’ అన్నాడు. జనక మహారాజు మహర్షిని అభినందించి రాజ్యంలో భాగం ఇవ్వబోతే.. ‘రాజ్యం క్షత్రియ భోజ్యం. తాపసినైన నాకు దాంతో పనేముంది?’ అంటూ వెళ్లిపోయాడు.

డాక్టర్‌ జయదేవ్‌ చల్లా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని