నరకానికే వెళ్తాను..

ఒకరోజు బుద్ధుడి ధ్యానమందిరంలో ఒక శిష్యుడు ‘మరణానంతరం మనం స్వర్గానికి వెళ్తామా లేక నరకానికా?’ అనడిగాడు. ‘మనం మంచి పనులు చేస్తున్నాం కాబట్టి స్వర్గానికే వెళ్తాం’ సమాధానం చెప్పాడు రెండో శిష్యుడు.

Published : 26 Oct 2023 00:02 IST

ఒకరోజు బుద్ధుడి ధ్యానమందిరంలో ఒక శిష్యుడు ‘మరణానంతరం మనం స్వర్గానికి వెళ్తామా లేక నరకానికా?’ అనడిగాడు. ‘మనం మంచి పనులు చేస్తున్నాం కాబట్టి స్వర్గానికే వెళ్తాం’ సమాధానం చెప్పాడు రెండో శిష్యుడు. ఆ మాటలన్నీ వింటున్నాడు బుద్ధుడు.

‘తథాగతా! మా మాటలు విన్నారు కదా! దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు?’ అంటూ బుద్ధుణ్ణి అడిగాడు మొదటి వ్యక్తి. గౌతముడు ఒక నిమిషం మౌనముద్ర దాల్చాడు. శిష్యులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. ‘ఇలాంటి ప్రశ్న అడగకూడదా? గురువర్యునికి కోపం వచ్చిందా?’ అని మథనపడుతున్నారు. బుద్ధుడు కళ్లు తెరిచి ‘నన్ను నరకానికి వెళ్లనివ్వండి’ అన్నాడు. ‘అయ్యో అలా అంటున్నారేం స్వామీ? కారణం ఏమిటి?’ కంగారుగా అడిగారు శిష్యులు. ‘స్వర్గంలో నేను చేయగల ప్రత్యేక పని అంటూ ఏమీ లేదు. నరకంలో అయితే నేను ఎవరికైనా సాయం చేయగలను’ అన్నాడు బుద్ధభగవానుడు.

‘విశిష్టమైన ఆలోచనలు మన జీవితంలో భాగం అవ్వాలి. అవి మన వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దాలి. మన చుట్టూ ఉన్నవారికి ఒక ధర్మమార్గం చూపాలి’ అంటూ వివరించాడు పరిణతి సాధించిన మరో శిష్యుడు.

శివలెంక ప్రసాదరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని